గౌతమీ పుత్ర శాతకర్ణి పై హైకోర్టులో విచారణ

ఏపీ ప్రభుత్వం అధికార పార్టీ ఎమ్మెల్యే అయినందునే బాలక్రిష్ణ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాకు పన్ను మినహాయింపును ఇచ్చిందని.. దీన్ని సవాల్ చేస్తూ బుధవారం హైదరాబాద్ కు చెందిన ఓ న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనలకు విరుద్ధంగా పన్ను మినహాయింపును ఇచ్చారని.. గతంలో రుద్రమదేవికి ఎందుకు ఇలా ఇవ్వలేదని ప్రశ్నించారు. బాలక్రిష్ణ బంధువు అయినందునే ముఖ్యమంత్రి చంద్రబాబు పన్ను మినహాయింపు నిస్తూ నిబంధనలు సడలించారని పిటీషన్ దారు హైకోర్టుకు విన్నవించారు. కాగా పండుగ సెలవుల కారణంగా హైకోర్టు కు సెలవులు ఉండడంతో రెగ్యులర్ బెంచ్ కు కేసును బదిలీచేశారు..

ఈ పిటీషన్ను  విచారణకు స్వీకరించిన హైకోర్టు.. నిబంధనలు అతిక్రమిస్తే నిర్మాత నుంచి డబ్బు వసూలు చేయవచ్చని అభిప్రాయపడింది.. తప్పు అని తేలితే వినోదపన్ను రద్దు చేస్తామని.. ప్రస్తుతానికి కేసు ను వాయిదా వేసింది.. కాగా గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి మొదట తెలంగాణ ప్రభుత్వం వినోదపు పన్ను మినహాయింపును ఇచ్చింది.. అనంతరం ఏపీ కూడా అదే రీతిలో ఇచ్చింది. సంక్రాంతి కానుకగా శాతకర్ణి మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.. హైకోర్టు తీర్పు నేపథ్యంలో చిత్ర బృందం డైలామాలో పడింది..

To Top

Send this to a friend