గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ రివ్యూ

భారత దేశాన్ని ఏలిన తెలుగు రాజు కథ గౌతమి పుత్ర శాతకర్ణి.. ఆయన సాధించిన విజయాలు.. దండయాత్ర.. చరిత్రను తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపారు.. బాలయ్య వందో చిత్రంగా శాతకర్ణి కథను ఎంచుకోవడంలో చాలా వరకు విజయం సాధించారు. ఇక వైవిధమైన కథలతో సమాజానికి మెసేజ్ ఇస్తూనే హిట్ లు కొట్టిన దర్శకుడు క్రిష్.. అందుకే వీరిద్దరు కాబింనేషన్ గా వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణిపై అంచనాలు పెరిగిపోయాయి.. క్రిష్ బాలయ్య వందో చిత్ర దర్శకుడిగా చాలా బరువు మోసారు. అదే సమయంలో శాతకర్ణి వంటి రాజుల చరిత్రను తెరపై చూపించే ప్రయత్నం చేశారు.. మరి ఇందులో విజయం సాధించారా..? అభిమానులు ఏమనుకుంటున్నారో తెలుసుకుందా..

కథ ఏంటీ..?

క్రిష్ గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలో చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే ఆ తెలుగు రాజు కథను, ఆయన పరిపాలన దక్షత, వ్యవహారశైలి, ఆలోచనా, ప్రజలకు చేసిన సంస్కరణలను ఎక్కడా చూపించలేదు.. క్రిష్ సినిమా కోసం చాలా పరిశోధన చేశాను అని గతంలో ప్రకటించాడు. కానీ ఎక్కడా ఆ పరిశోధన ఫలాలు తెరపైకి చూపించలేదు. కేవలం సినిమాటిక్ గా కమర్షియల్ గా సినిమాను తీశారు. ఇందులో డ్రామకు కనీసం పావుగంట సమయం కూడా ఇవ్వలేదు.. సినిమా మొత్తం బాలయ్య బాబు యుద్ధ సన్నివేశాలతోనే నింపేశారు.. శాతకర్ణి మూడు యుద్ధాలను తెరపై చూపించారు. మొదటి పాత్ర పరిచయానికి.. రెండో ఫస్ట్ హాఫ్ లో పావుగంట సేపు సుదీర్ఘంగా సాగే మహాయుద్ధం.. అందుకే సినిమా చూసిన ప్రేక్షకులు యుద్దాన్ని తప్ప కథను చూడలేదంటున్నారు. ఇక సెంకడాఫ్ లో భార్యభర్తల మధ్య అభిప్రాయ భేదాలు.. కాసేపు ఫ్యామిలీ డ్రామ నడుస్తుంది.. తల్లి, స్రీ పాత్రలపై శాతకర్ణి బాలయ్యకు ఉన్న ప్రేమ అభిమానాన్ని కాసేపు చూపించారు.. భారత ఖండాన్ని ఏకతాటిపైకి తీసుకురావడానికి విజయాలు సాధిస్తూ.. గ్రీకు చక్రవర్తి డిమిత్రియస్ తో యుద్ధం చేస్తాడు. సెకాండాఫ్ లో గ్రీకులతో యుద్ధమే ఎక్కువ భాగం మనకు కనిపిస్తుంది.. ధైర్యసాహసాలు, యుద్ధం మినహా ఎక్కడా క్రిష్ కథను ఎలివేట్ చేయకపోవడం పెద్ద లోపంగా చెప్పవచ్చు..

ఇక యుద్దాల ముసుగులో బాలయ్య హెచ్చరికలు, పంచ్ డైలాగులు ఆయన అభిమానుల్ని అయితే బాగానే అలరిస్తాయి.. కానీ సుదీర్ఘంగా సాగిన యుద్ధ సన్నివేశాలు మాత్రం సగటు ప్రేక్షకుడికి విసుగు పుట్టించాయి.. క్లైమాక్స్ ఫైట్ అయితే చప్పగా సాగింది.. క్రిష్ గత చిత్రాల్లో ఆయన వైవిధ్యం చూపించినా ఇందులో బాలయ్యమీద ఫోకస్ చేసి కథను మరిచినట్టు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.. కాగా పంచ్ డైలాగులతో రచయిత సాయి మాధవ్ బుర్రా బాలక్రిష్ణ సినిమాకు ప్రాణం పోశాడనే చెప్పాలి.. గ్రాఫిక్స్ పరంగా బాహుబలి లాంటి హైప్ లేదు. వాడేసిన సినిమాల్లోని యుద్ధసన్నివేశాలను రిపీట్ చేసి వేయడంతో విసుగు పుట్టింది.. విజువల్ ఎఫ్టెక్ట్ లో కూడా ఆదరబాదర కన్పించింది..

విశ్లేషణ..

తెలుగు రాజు భారత దేశాన్ని ఏకచత్రాదిపత్యం కిందకు తెచ్చిన పూర్తి వివరాలు శాతకర్ణి మూవీలో లేవు.. తెలుగు వారి కి ఏమోషన్ ఫీలింగ్ , గెలిచామనే సంతృప్తి తప్పితే లోతుగా కథలో కి వెళ్లలేదు.. బాలయ్య ఆవేశపూరిత డైలాగులు, ప్రాంతీయతత్వ పంచ్ లు.. నటన, డైలాగులు ఈ చిత్రానికి ప్రదానాకర్షణ.. యుద్ధ సన్నివేశాలు తగ్గించి ఆ మహా చక్రవర్తి పరిపాలన.. చరిత్ర గురించి తెలియజెప్పి ఉంటే డ్రామా బాగా పండి సినిమాకు కలిసి వచ్చేది..కానీ మితిమీరిన యుద్ధ సన్నివేశాలే ఆ సినిమా కొంప ముంచాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓ యుద్దంలో తన కొడుకును తీసుకెళ్లడం లాంటి ట్విస్ట్ తప్ప అందులో లోతయిన సమాధానపూర్వక అంశాలు లేవు..

ఇవన్నీ పక్కనపెట్టి సంక్రాంతి బరిలో ఇంత హడావుడిగా దిగిన బాలయ్య-క్రిష్ లు కేవలం యుద్దాన్ని బేస్ చేసుకొని కథను విస్మరించడం విమర్శలకు తావిస్తోంది.. వందో చిత్రం.. భారీ హైప్ ఉన్నా కూడా కనీసం ఒక బృందంగా దీని మీద కసరత్తు చేయకుండా చరిత్ర అభిమానులకు తెలియకుండా సినిమాను విడుదల చేయడంతో సాధారణ సగటు ప్రేక్షకుడిగా బాలయ్య సినిమా విందు భోజనంలా అనిపించట్లేదు. తెలుగు రాజు చరిత్ర చిత్రం కావడంతో తెలుసుకోవడానికి ఖచ్చితంగా చూడాల్సిన సినిమా..కానీ భారీ ఎక్స్ ప్టెషన్ తో వెళితే మాత్రం నిరుత్సాహం తప్పదు..

గౌతమిపుత్ర శాతకర్ణి మూవీకి రేటింగ్ : 2.50/5

To Top

Send this to a friend