గోవా చేపల కోసం రక్షణమంత్రి పీచేముడ్


జిల్లా అంత రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి, దేశంలోనే అత్యున్నత రక్షణ మంత్రి పదవి..? ఈ రెండింటిలో మీకు చాయిస్ ఇస్తే దేన్ని కోరుకుంటారు.. ఖచ్చితంగా దేశరక్షణ మంత్రి పదవినే.. కానీ ఆయన డిఫెరెంట్.. భారత రక్షణమంత్రిగా దేశవిదేశాలతో సంప్రదింపులు.. దేశంలో గుర్తింపు దక్కతున్నా కానీ ఆయన గోవా అందాలు, తిండికే ఫిదా అయ్యాడు. తన మనసు ఢిల్లీలో ఉండటాన్ని ఇక్కడి తిండిని సంహించట్లేదని సన్నిహితులతో చెప్పుకునే వారు. చివరకు ఎలాగో లాబీయింగ్ చేసి మళ్లీ గోవా సీఎంగా వెళ్లిపోయారు రక్షణమంత్రి మనోహర్ పారికర్..

ఓ దిగ్గజ నాయకుడు.. ఐఐటీయన్ అయిన వ్యక్తికి దేశ రక్షణమంత్రి పదవిని ఇచ్చి గౌరవించారు ప్రధాని మోడీ.. కానీ ఆయన మనసు దాన్ని కోరుకోలేదు.. జిల్లా అంత ఉన్న అతిచిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా వెళ్లడానికి ఇష్టపడ్డాడు..

గోవా ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడ్డాయి. మొత్తం 40 స్థానాల్లో ఎవ్వరికి మెజార్టీ దక్కలేదు. కాంగ్రెస్ పార్టీ 17మంది సభ్యులతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 13మందితో రెండో పార్టీగా ఓడిపోయింది. కానీ అనూహ్యంగా ప్రస్తుత గోవా సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ తో పాటు ఆరుగురు మంత్రులు ఈ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. పర్సేకర్ తో విభేదించి బయటకు వచ్చిన ఎమ్మెల్యే ఎంజేపీ పార్టీలో చేరి విజయం సాధించారు. దీంతో ఆ ఆరుగురు తమకు మనోహర్ పారికర్ సీఎం అయితేనే మద్దతిస్తామని స్పష్టం చేశారు. ఢిల్లీలో మోడీ, అమిత్ షా దీనిపై కీలక నిర్ణయం తీసుకొని దేశ రక్షణమంత్రి పారికర్ ను గోవా సీఎంగా పంపేందుకు నిర్ణయించారు. దీంతో పారికర్ గవర్నర్ ను స్వతంత్రులు, మద్దతుదారులతో నిన్న అర్థరాత్రి కలవడం.. గవర్నర్ మనోహర్ సీఎంగా ప్రభుత్వ ఏర్పాటుకు నోటిఫికేషన్ వేయడం చకచక జరిగిపోయాయి.

ఇలా ఓ రక్షణమంత్రి తనకు నప్పని రక్షణమంత్రి పదవిని.. సహించని తిండి వదిలేసి స్వేచ్ఛగా తన సొంతూరు గోవాకు సీఎంగా వచ్చేశారు. ఆయన అభిలాష కూడా అదే.. పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగే గోవానే ముద్దు అని పారికర్ నిరూపించారు.

To Top

Send this to a friend