గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో హ‌న్సిక‌

hansika
డిఫ‌రెంట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్స్‌ లో న‌టిస్తూ త‌న‌కంటూ మాస్ హీరోగా  ప్ర‌త్యేకత‌ను సంపాదించుకున్నాడు గోపీచంద్. `య‌జ్ఞం`, `ఆంధ్రుడు`, `ల‌క్ష్యం`, `శౌర్యం`, `శంఖం`, `గోలీమార్` జిల్ వంటి హిట్ చిత్రాలతో ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. ఇప్పుడు `ఆక్సిజ‌న్` అనే మరో డిఫ‌రెంట్ యాక్ష‌న్ చిత్రంలో నటిస్తున్న గోపీచంద్ హీరోగా హ్యాట్రిక్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో అన్నీ ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో కూడిన హై ఓల్టేజ్ యాక్ష‌న్‌ మాస్ ఎంటర్ టైనర్ రూపొందనుంది. `ఏమైంది ఈవేళ` అనే యూత్‌ఫుల్ ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్‌తో స‌క్సెస్ కొట్టి త‌ర్వాత మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్‌తో `ర‌చ్చ` అనే సెన్సేష‌న‌ల్ హిట్ సాధించ‌డ‌మే కాకుండా మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ను `బెంగాల్ టైగ‌ర్` అంటూ స‌రికొత్త యాంగిల్‌లో ప్రెజంట్ చేసిన స్టార్ డైరెక్టర్ సంప‌త్ నంది. ఈ మూడు చిత్రాలను మూడు డిఫరెంట్ ఫార్మేట్స్ లో నిర్మించి హ్యాట్రిక్ సాధించిన దర్శకుడు సంపత్ నంది ద‌ర్శ‌త్వంలో శంఖం, రెబల్ వంటి యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యాన‌ర్‌పై జె.భగవాన్, జె.పుల్లారావు  నిర్మాత‌లుగా ఓ భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ సినిమా రూపొందుతుంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ చిత్రంలో గోపీచంద్ స‌ర‌స‌న  హీరోయిన్‌గా  బ‌బ్లీ బ్యూటీ హ‌న్సిక న‌టిస్తుంది.  రెండేళ్ళ గ్యాప్ త‌ర్వాత హ‌న్సిక తెలుగులో చేస్తున్న చిత్ర‌మిది. గోపీచంద్‌, సంప‌త్ నంది, జె.భ‌గ‌వాన్‌, పుల్లారావు వంటి టీంతో వ‌ర్క్ చేయ‌డం ప‌ట్ల హ‌న్సిక త‌న సంతోషాన్ని వ్య‌క్తం చేసింది.
To Top

Send this to a friend