గొప్ప కాంప్లిమెంట్‌గా భావిస్తున్నా! – V.V.Vinayak

రైతు నాయకుడిగా చిరంజీవి ఇమేజ్, శైలికి సరిపోయే అంశాలతో సినిమాను తీర్చిదిద్దాం. మాతృకతో పోలిస్తే కథలో పెద్దగా మార్పులు చేయలేదు. రైతుల కోసం పోరాడే నాయకుడిగా చిరంజీవి పాత్ర ప్రభావవంతంగా సాగుతుంది. రెండు భిన్న పార్వ్శాల్లో వైవిధ్యంగా ఆయన కనిపిస్తారు.

చిరంజీవికి జోడీగా అనుష్క, కాజల్ అగర్వాల్‌లలో ఒకరిని తీసుకోవాలని అనుకున్నాం. బాహుబలి, ఓం నమో వేంకటేశాయ సినిమాలతో బిజీగా ఉండటంతో అనుష్క డేట్స్ సర్దుబాటు కాలేదు. దాంతో కాజల్‌ను తీసుకున్నాం. హీరో లక్ష్యసాధనలో తోడ్పాటునందించే యువతిగా కాజల్ కనిపిస్తుంది.

ఓ సినిమా పరాజయ ప్రభావం తప్ప కుండా దర్శకులపై ఉంటుంది. అఖిల్ సినిమాతో కొంత నిరాశలో మునిగిపోయాను. కానీ ఆ డిఫ్రెషన్ నుండి చిరంజీవి నన్ను బయటపడేలాచేశారు. కత్తి కథ అనుకోగానే దర్శకుడిగా నా పేరే గుర్తొచ్చిందని చిరంజీవి అనడం గొప్ప కాంప్లిమెంట్‌గా భావిస్తున్నాను.

చిత్ర నిడివి ఎక్కువ కావడంతో పృథ్వీ నటించిన సన్నివేశాల్ని తొలగించాం. ఆ విషయాన్ని ఆయనకు ఫోన్‌చేసి చెప్పాను. కానీసినిమాలో నుంచి తనను తొలగించిడం తల్లి చనిపోయినంత అవేదనగా ఉందని అన్నారు. ఆయన మాటలు చిరంజీవితో పాటు నన్ను బాధించాయి. అందరం సంతోషంగా ఉండే సమయంలో అతడిని బాధపెట్టడం ఇష్టంలేక పృథ్వీ నటించిన సన్నివేశాల్ని యధాతథంగా సినిమాలో ఉంచాం.

To Top

Send this to a friend