గుణశేఖరా.. ఎందుకయ్యా సాహసం?

 

సినిమా అంటేనే రంగుల ప్రపంచం.. అక్కడ జయాపజయాలు నిర్ణయించేది ప్రేక్షకులే.. హిట్ కొడితే ఆ దర్శకుడికి, హీరోకు బతుకు.. ప్లాప్ అయితే మళ్లీ సినిమాల చాన్సులు కష్టమే.. అంతటి క్లిష్టమైన సినీ ఇండస్ట్రీలో ఒక సినిమా తీయాలంటే ఎంతో ఆచితూచీ ఆలోచించాలి.. పకడ్బందీ స్క్రిప్ట్, కథ, కథనం, కొత్తదనం అన్నీ ఉంటేనే సినిమా తీయాలి.. లేదంటే ఆ దర్శకులు తెరమరుగు కావాల్సిందే.. రోటీన్ కు భిన్నంగా ముందుకెళ్లాలి.. మూస ధోరణి కథలు విడనాడాలి.. అందుకే క్రియేటివిటి దర్శకులే ఇప్పుడు తెలుగు తెరపై విజయాలను అందుకుంటున్నారు.. అరిగిపోయిన కథలతో తీసిన దర్శకులు ప్లాపులతో వెనక్కి వెళ్లిపోతున్నారు..

ఒక దెబ్బ తగిలితే దాన్నుంచి గుణపాఠం నేర్చుకొని మున్ముందు అలాంటివి జరగకుండా చూసుకోవాలి.. పాపం అని ఆదరించిన వాళ్ల మెప్పు పొంది మరోసారి అలాంటివి ఉత్పన్నం కాకుండా చూసుకోవాలి.. కానీ అలా జరగడం లేదు.. రుద్రమదేవి మూవీని తీశాక.. అందుకోసం ఇళ్లూ వాకిలి తాకట్టు పెట్టి 70కోట్లతో సినిమాయే సర్వస్వం అని నమ్మి గుణశేఖర్ రుద్రమదేవిని నిర్మించారు. అప్పుడు గుణశేఖర్ పై సినీ ఇండస్ట్రీలో సానుభూతి వెల్లువెత్తింది. అల్లు అర్జున్ స్పందించి ఫ్రీగా గోన గన్నారెడ్డి పాత్రను పోషించారు. సినిమాకు అనుష్క ఎంత హెల్ప్ అయ్యిందో అల్లు అర్జున్ నటించాక సినిమాకు క్రేజ్ వచ్చింది. అల్లు అరవింద్ కూడా సాయం చేసి సినిమా ప్లాప్ కాకుండా చక్కదిద్దారు. దీంతో గుణశేఖర్ కు తాను తీసిన సినిమాకు డబ్బులు వచ్చాయి. అక్కడితే ఆగితే గుణశేఖర్ తో పాటు అందరూ హ్యాపీగా ఉండేవారు.. కానీ గుణ రుద్రమదేవి రిస్క్ చూశాక కూడా మళ్లీ అటువైపే అడుగులేయడం విమర్శలకు తావిచ్చింది. మళ్లీ చారిత్రక కథాంశంతో ‘హిరణ్యకశప’ సినిమా తీస్తానని గుణశేఖర్ నిన్న ప్రకటించారు. అందులో కథ నచ్చితే ఎన్టీఆర్ హీరోగా నటిస్తారట.. దీన్ని తానే నిర్మిస్తానని చెప్పుకొచ్చారు. సింహాచలంలోని వరాహా లక్ష్మీ నర్సింహాస్వామిని దర్శించుకున్న గుణశేఖర్ ఈ సందర్భంగా విలేకరులతో తన ఫ్యూచర్ ప్రాజెక్టులు వెల్లడించారు. ఎన్టీఆర్ తో హిరణ్యకశప.. రుద్రమదేవి సీక్వెల్ ‘ప్రతాపరుద్ర’ మూవీని తీస్తానని ప్రకటించారు.

కానీ ఈ రెండు చారిత్రక సినిమాలు తీయడం.. నిర్మించడం అంత తేలిక కాదు.. కోట్లు కావాలి. రుద్రమ దేవి నిర్మించి ఇప్పటికే చేతులు కాల్చుకున్న దర్శకుడు గుణశేఖర్ మరోసారి అలాంటి తప్పే చేస్తుండడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.. కోట్లు పెట్టి తీసిన సినిమా అటు ఇటు అయితే గుణశేఖర్ నిండా మునుగుతారు.. ఆయనకు కథపై నమ్మకం ఉన్నా హీరోలు ముందుకు వస్తారన్న గ్యారెంటీ లేదు. వారు వచ్చినా మునుపటిలా రాజమౌళి, క్రిష్ లా సినిమా తీస్తాడా లేదా అన్నది డౌటే.. ఇలాంటి పరిస్థితుల్లో తన తాహతకు మించి భారీ చిత్రాలకు పోకుండా చిన్న చిత్రాలతో ముందుకు సాగితే అటు గుణశేఖర్ కు.. ఇటు చిత్రసీమకు మంచిది.

To Top

Send this to a friend