గుంటూరోడు.. పాత చింతకాయ కథలు.

జీవితంలో లక్ష్యమంటూ లేకుండా బలాదూర్ గా తిరిగే యువకుడే హీరో.. సమాజానికి ఇలాంటి వారితోనే మెసేజ్ ఇవ్వాలన్నమాట.. వాడు చదివాడో లేదో తెలియదు.. ఓ లవర్.. లవ్ చేస్తాడు.. వేధిస్తాడు.. చివరకు ఆమె లవ్ లో పడిపోతుంది.. నాలుగు పాటలు.. తెరపై హీరోయిన్ ఎక్స్ పోజింగ్.. హీరోయిన్ తో విలన్ బంధుత్వం నాలుగు ఫైట్లు.. సీన్ సీన్ కు లింక్ లేకుండా ప్రేక్షకులను విసిగించే కథ.. కథనాలు.. ఇదీ గుంటూరోడు సినిమా కథ..

ఎంతసేపు అవే కథలు.. కథనాలా.? కొత్త దనం లేదా..? అందుకే జనాలు బండకేసి కొడుతున్నారు.. కోట్లు పెట్టి తీసే సినిమాల విషయంలో ఇంత దరిద్రమైన కథలు ఎలా ఎంచుకుంటారో ఆ దర్శకుడికి, హీరోకు, చివరకు డబ్బులు పెట్టే నిర్మాతకు అయిన సోయి ఉండొద్దా..? ఎందుకీ దౌర్భాగ్యం.. ఇలాంటి పాత చింతకాయపచ్చడి లాంటి కథలకు పైగా చిరంజీవి గొంతు ఇవ్వడం హైప్ సృష్టించడం నిజంగా విడ్డూరం..

ఇలాంటి కథలు చేసి చేసి మహేశ్, పవన్, ఎన్టీఆర్ తదితర హీరోలు చేతులు కాల్చుకున్నారు. అందుకే లేట్ అయినా కానీ కొత్తదనం కోసం వీరు ప్రయత్నిస్తున్నారు. ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో.. ఇప్పుడు రాంచరణ్ సుకుమార్ మూవీ., మురగదాస్-మహేశ్ ల మూవీలో కథా ప్రాధాన్యం గలవే చేస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచిని బట్టి కథలను ఎంచుకుంటే విజయం సాధిస్తారు.. ఈ మాత్రం లాజిక్ లేకుండా అదే మూసధోరణితో తీసిన గుంటూరోడు అడ్డంగా ప్లాప్ అయ్యింది. ఇప్పటికైనా ఇలాంటి హీరోలు బుద్దితెచ్చుకొని మంచి కథలు ఎంచుకుంటే వారికి మంచిది.. ఇండస్ట్రీకి మేలుచేసినవారవుతారు.. జనాల డబ్బులు మిగిల్చిన వారవుతారు..

To Top

Send this to a friend