గవర్నర్ పైనే కేసువేస్తా.. బీజేపీ లీడరే

బీజేపీలో ఉంటూ బీజేపీ ఆడిస్తున్న ఆటకు సహకరించకుండా ఆ పార్టీకే వ్యతిరేకంగా ఏకుమేకులా తయారవుతున్నాడు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణస్వామి.. ఎప్పుడు రాంగోపాల్ వర్మలా వివాదాస్పదుడిగా పేరుపొందిన సుబ్రహ్మణ్యం బీజేపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు.
ఇటీవల తమిళనాడులో తన అనుయాయుడైన పన్నీర్ సెల్వంను సీఎం చేసేందుకు ఓ వైపు మోడీ అండ్ కో గవర్నర్ తో విశ్వప్రయత్నాలు చేస్తుంటే దానికి సహకరించాల్సింది పోయి ఏకంగా వ్యతిరేకంగా సుబ్రహ్మణ్యం పోతుండడం బీజేపీకి మింగుడు పడడం లేదు.
శనివారం రాత్రి ఆకస్మికంగా గవర్నర్ విద్యాసాగర్ రావుతో భేటి అయిన ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి రాజ్యాంగం ప్రకారం శశికళకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశమివ్వాలని కోరారు. తమిళనాడులో రాజకీయ సంక్షోభాన్ని సోమవారం లోగా పరిష్కరించకపోతే గవర్నర్ పై సుప్రీం కోర్టులో కేసు వేస్తానని సుబ్రహ్మణ్యం హెచ్చరికలు జారీ చేశారు. దీంతో బీజేపీకే చిక్కులు వచ్చిపడ్డాయి. ఓ వైపు మెల్లగా శశికళను సీఎం చేయకుండా సాగదీస్తున్న బీజేపీకి సుబ్రహ్మణ్యం చర్యలు శరాఘాతంగా మారాయి.

To Top

Send this to a friend