ఖైదీ రెస్పాన్స్ చూసి కుళ్లు కుంటున్నారట..

chiru-khaidino150-prerelease

చిరంజీవి దాదాపు 10 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తే అంత గొప్ప నటుడిని స్వాగతించకపోతే ఫర్వాలేదు.. కానీ అడ్డంకులు సృష్టించారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. చిరు చిరుమందహాసంతో ఎదుర్కొన్నారు.. ముందు విజయవాడ-గుంటూరులలో చిరు యాంటీ బాబులు ప్రి రిలీజ్ ఆడియో వేడుకకు పర్మిషన్ ఇవ్వలేదు.. హ్యాయ్ ల్యాండ్ లో నిర్వహించిన పండుగనూ త్వరగా ముగించేశారు.. అయినా మొక్కవోని దీక్షతో చిరు తన పని తాను చేసుకుపోయారు. ఈరోజు ఖైదీ రిలీజ్ అవుతోంది. ఇప్పటికే బెన్ ఫిట్ షోలు చూసిన వారందరూ బ్లాక్ బస్టర్ హిట్ అంటూ కితాబిస్తున్నారు.. దీన్ని చూసి చిరు ప్రత్యర్థి వర్గం.. చిరుకు ఇబ్బందులు సృష్టించనవారు కుళ్లుకుంటున్నారట.. ఈ పరిణామాలు చిరు ఫ్యాన్స్ కు ముఖ్యంగా చిరుకు మద్దతుగా నిలిచిన వైసీపీ, చిరు సామాజిక వర్గ నేతలను ఆనందంలో ముంచెత్తుతున్నాయట.. ముఖ్యంగా చిరుకు పర్మిషన్ ఇవ్వడంలో జాప్యం చేసినందుకు చంద్రబాబు ప్రభుత్వంపై చిరు సామాజిక వర్గం అయిన కాపులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ముద్రగడకు చిరు మద్దతు, వంగవీటి వ్యవహారం, తదితర విషయాలు కూడా చిరంజీవికి కాపుల మద్దతు లభించడానికి .. బాబుపై వ్యతిరేకత రావడానికి కారణమైంది..

ఇక చిరంజీవి కూడా వ్యూహాత్మకంగా తన ప్రచారాన్ని అటునుంచి నరుక్కువచ్చారు. చంద్రబాబు అండ్ కో వ్యతిరేకిస్తున్నందున.. చిరంజీవి తన 150 వ సినిమా ప్రమోషన్ లో భాగంగా తొలి ఇంటర్వ్యూను వైసీపీ జగన్ పత్రిక అయిన సాక్షికి ఇచ్చాడు. ఈ అవకాశాన్ని వాడుకున్న సాక్షి ఏకంగా నటి, ఎమ్మెల్యే రోజాతో చిరు ను ఇంటర్వ్యూ చేయించి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. అటు చంద్రబాబు అండ్ కో చిరుకు ప్రచారం దక్కకుండా చేయాలనే ప్రయత్నాలు.. ఇటు బాబు యాంటీ జగన్ మీడియా, కాపులు చిరు కోసం తహతహలాడడం చూశాక ఇది రాజకీయ వార్ గా మారింది. కానీ చిరు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావడంతో చిరుకు అడ్డంకులు సృష్టించిన యాంటీ చిరు వ్యక్తులకు ఇప్పుడు నిద్రపట్టడం లేదట.. ఇంత చేసినా చిరు నెగ్గాడనే ఆవేదన వారిలో ఉందట..

To Top

Send this to a friend