ఖైదీ నంబర్ 150 సుల్తాన్, బాహుబలిని అధిగమించడం ఖాయమట..

khaidino150

చిరంజీవి 150 వ సినిమా ఈరోజు రిలీజ్ అవుతుండడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఉన్న తెలుగు వారందరిలో ఉత్కంఠ నెలకొంది. సినిమా టికెట్ల కోసం ఎగబడుతున్నారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత చిరు రంగ ప్రవేశంతో అంతటా హీట్ పెరిగిపోయింది.. ఈ ఊపులో ఖైదీ నంబర్ 150 సినిమా కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది.. రికార్డు దిశగా సాగుతోంది.. తెలుగు చలన చిత్ర పరిశ్రమలోన ఇప్పటివరకు భారీ రికార్డు కలెక్షన్లు సాధించిన బాహుబలిని ఖైదీ నంబర్ 150 ఖచ్చితంగా అధిగమిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏపీ, నైజాం, విదేశాల్లో మొత్తం తొలిరోజు కలెక్షన్లను చూసుకుంటే బాహుబలి తొలిరోజు దాదాపు 22.4 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. హిందీ సుల్తాన్ సినిమా దేశవ్యాప్తంగా 36 కోట్లు కొల్లగొట్టి రికార్డు సాధించింది.. ఈ రోజు చిరుమానియా చూస్తుంటే ఖైదీ నంబర్ 150 మూవీ తాజా లెక్కల ప్రకారం తొలిరోజు దాదాపు 40 కోట్లు వసూళ్లు సాధించడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అంచనావేస్తున్నాయి..

దేశంలో ఇప్పటివరకు అత్యధిక తొలిరోజు వసూళ్లు బాలీవుడ్ హీరో సల్మాన్ నటించిన సుల్తాన్ (36 కోట్లు) పేరిట ఉంది.. ఇది దేశవ్యాప్తంగా సాధించిన వసూళ్లు. చిరంజీవి దాదాపు 10 ఏళ్ల తర్వాత సినిమా తీయడం.. ఆయన సామాజిక కార్యక్రమాలు, రాజకీయాల్లోంచి సినిమాలకు రీఎంట్రీ ఇవ్వడం ఆయనకు మళ్లీ హైప్ ను తీసుకువస్తోంది.. అంతేకాకుండా సోషల్ ఓరియెంటెడ్ మూవీని ఎంచుకోవడం.. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రణాళికబద్దంగా ముందుకెళ్లడం కూడా కలిసి వచ్చింది.. పదేళ్ల తర్వాత చిరు సినిమా రావడంతో అభిమానులు, ప్రజలు ఎలాగైనా సినిమా చూడాలనే కసితో ఉన్నారు. అంతేకాకుండా సంక్రాంతి రిలీజ్ కావడం.. వరుస సెలవులు కూడా సినిమాకు ప్లస్ అయి అందరూ చూసేలా తోడ్పడ్డాయి. ఇలా అన్ని కలిసి వచ్చి తెలుగు ఇండస్ట్రీతో పాటు దేశవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు రాబట్టేందుకు చిరు ఖైదీ సినిమా వడివడిగా దూసుకుపోతోంది.. తొలిరోజు గడిస్తే కానీ ఆ రికార్డు కలెక్షన్లు ఎన్ని నమోదయ్యాయో తెలియదు.. అప్పటివరకు అందరూ వెయిట్ చేద్దాం..

To Top

Send this to a friend