ఖైదీ నంబర్ 150 ప్రపంచవ్యాప్త తొలివారం వసూళ్లు..

సంక్రాంతి కానుకగా విడుదలైన చిరు సినిమా కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది.. తొలి ఐదు రోజుల వసూళ్లు పీక్ స్టేజ్ కి చేరాయి.. కలెక్షన్ల రిపోర్టులు బయటకు వచ్చాయి. చిరంజీవి ఖైదీ నంబర్ 150 మూవీ బాలయ్య సినిమా శాతకర్ణిని బీట్ చేసి చాలా ముందంజలో ఉంది.. 12న రిలీజ్ అయిన ఖైదీ సినిమా ఏపీ, తెలంగాణల్లో ఇప్పటివరకు 52.17 కోట్లు కొల్లగొట్టింది… అటు ఇతర రాష్ట్రాలు, యూఎస్ఏ, ప్రపంచవ్యాప్తంగా ఖైదీ నంబర్ 150తో కలిపి మొత్తం 71.79 కోట్లు వసూలు చేసిందట.. చిరుకు నైజాం, సీడెడ్ లతో పాటు ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరులలో చిరు సినిమాకు అత్యధిక వసూళ్లు దక్కాయి. తొలివారం పూర్తి అయితే మరింత గా చిరుకు వసూళ్లు దక్కే అవకాశాలున్నాయి..

చిరంజీవి 150వ సినిమా 5 రోజుల కలెక్షన్లు..

నైజాం : 15.83 కోట్లు, సీడెడ్ : 8.58 కోట్లు, గుంటూరు :4.67కోట్లు, వైజాగ్ :8.15 కోట్లు, వెస్ట్ : 4.19 కోట్లు, ఈస్ట్ : 5.37కోట్లు , కృష్ణా : 3.34 కోట్లు, నెల్లూరు : 2.04 కోట్లు , = టోటల్ షేర్ : 52.17 కోట్లు

ఇక కర్ణాటక : 7.80 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా :1.50, యూఎస్ఏ: 7.23 కోట్లు, రెస్ట్ ఆఫ్ వరల్డ్ : 3.09

మొత్తం ప్రపంచ వ్యాప్తంగా షేర్ ఇప్పటివరకు : 71.79 కోట్లు

To Top

Send this to a friend