‘ఖైదీనంబర్ 150’, ‘శాతకర్ణి’ ప్రేక్షకుల ఆసక్తి దేనిపైన?

khaidino150-gpsk-apnewsonline

చిరంజీవి 150 వ సినిమా ఖైదీనంబర్ 150, బాలక్రిష్ణ 100 వ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి.. రెండు మేటి చిత్రాలే.. ఇద్దరు అగ్రహీరోలు తెలుగు పరిశ్రమ గర్వించదగ్గ ఆణిముత్యాలే.. కానీ ఈ ఇద్దరు ఒకేసారి బరిలోకి దిగబోతున్నారు.. సంక్రాంతి కానుకగా తమ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ఫ్యాన్స్ కు పండుగ తెస్తున్నారు..

మరి ఎవరి సినిమాపై ప్రేక్షకుల్లో ఎక్కువ అంచనాలున్నాయి..? దానికి కారణాలేంటి..? ఏ సినిమాకు జనం ఎక్కువ ఆసక్తి చూపుతున్నారనే విషయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది..

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సోలోగా ఎదిగిన స్టార్ మెగాస్టార్.. స్వశక్తితో ఎదిగాడు కాబట్టే మెగా స్టార్ అంటే తెలుగు సినీ పరిశ్రమతో పాటు ఇతర పరిశ్రమల్లో అభిమానం ఎక్కువగా ఉంది… ఆయన సినిమాలు కూడా ఆది నుంచి బ్లాక్ బాస్టర్ అయ్యి ఆయనను అగ్రహీరోను చేశాయి.

ఇక తండ్రి చాటు బిడ్డగా ఎన్టీఆర్ ప్రోద్బలంతో తెరంగేట్రం చేసిన బాలక్రిష్ణ ఆ తర్వాత స్వతంత్రంగా తనదైన ముద్రతో అగ్రహీరోగా ఎదిగారు. ఎన్టీఆర్ అసలైన వారసుడిగా ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతున్నాడు.. ఎన్టీఆర్ వలే చారిత్రక నేపథ్య కథల్లో ఒదిగిపోయి అందరి మనసులు చూరగొన్నాడు..

ఇప్పుడు ఈ ఇద్దరు అగ్రహీరోలు సంక్రాంతి బరిలో పందెంకోళ్లు వలే తలపడబోతున్నారు. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లి వచ్చి చాలా గ్యాప్ తో 150 వ సినిమా తీస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. చాలా కథలు విని చివరకు తమిళ కథను ఎంచుకొని రైతుల సమస్యనే ప్రధాన ఇతివృత్తంగా సినిమాను రూపొందించారు. రాజకీయాలు, సమాజ పోకడలను కథగా చెప్పబోతున్నారు.సామాజిక ఎజెండాను ఎంచుకున్న ఈ కథపై ఆయన అభిమానుల్లో , ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీ ఉంది.

కాగా బాలయ్య.. 100 చిత్రాన్ని డిఫెరెంట్ గా ఎంచుకున్నారు. పౌరాణిక గాథను, అదీ ఆంధ్రుల రాజైన గౌతమి పుత్ర శాతకర్ణి కథను ఎంచుకొని సినిమా తీశాడు. బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ పౌరాణిక కథ తర్వాత వస్తున్న శాతకర్ణిపై జనంలో ఆసక్తి ఉంది. ఎందుకంటే అది మనల్ని పాలించిన కథ.. ఇప్పటికే భైరవ ద్వీపం లాంటి పౌరాణిక కథ, ఆదిత్య 369 లాంటి ప్రయోగాత్మక కథల్లో రాజుల వేషాలు వేసి అలరించిన బాలయ్య శాతకర్ణి పాత్రలో ఇమిడిపోతాడనడంలో ఎలాంటి సందేహం లేదు..

రెండు చిత్రాలను పోల్చి చూసినప్పుడు జనం దేనికి కనెక్ట్ అవుతారనేది ఆసక్తి కరం.. చరిత్రను తవ్వితీసే బాలయ్య శాతకర్ణికి ఓటు వేస్తారా..? సామాజిక సృహతో మేల్కొలిపే చిరంజీవి ఖైదీ నంబర్ 150కి విజయం కట్టబెడతారా.. ఒకేసారి బరిలోకి దిగుతున్న ఈ రెండు చిత్రాల్లో ఏదీ ఘనవిజయం సాధిస్తుందనే విషయంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రెండు ఘనవిజయం సాధించినా సరే ఎవరిది పైచేయి అవుతుందనే ఆసక్తి నెలకొంది.. క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు మాత్రం సామాజిక కథ ఖైదీనంబర్ 150 కంటే కూడా చారిత్రక కథ శాతకర్ణిపైనే కొంత జనం మొగ్గు కనిపిస్తోందని తెలుగు సినీ విమర్శకులు చెబుతున్నారు. రెండు దేనికదే ప్రత్యేకం.

To Top

Send this to a friend