క్రిష్ ఏంటీ..? బాలయ్య ఏంటీ.. ఇంత బ్యాడ్ కాంబినేషనా..: రాజమౌళి

‘‘బాలయ్య.. ఫుల్ మాస్ హీరోగా.. డైలాగులతో అందరగొడతారు.. మాస్ లో పిచ్చ క్రేజీ.. క్రిష్ ఏంటీ..? క్లాస్ డైరెక్షర్.. మెసేజ్, క్లాస్ డైరెక్టర్.. వీరిద్దరు ఏంటీ.. కలవడమేంటి.. గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా అట్లర్ ప్లాప్ అవడం ఖాయం అనుకున్నానని.. ’’ దిగ్గజ దర్శకుడు, బాహుబలి డైరెక్టర్ రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. క్రిష్ తో ముఖాముఖి గా జరిగిన ఈ ఇంటర్వ్యూలో రాజమౌళి నిర్మొహమాటంగా అనుకున్నారట.. క్రిష్ కు బాలక్రిష్ణకు సూట్ కాదని.. తన 100 వ చిత్రాన్ని బాలయ్య ఇలాంటి కథను ఎంచుకోవడం..క్రిష్ ను డైరెక్టర్ గా ఎంచుకోవడం తో సినిమా పోయిందని అనుకున్నానని రాజమౌళి చెప్పారు..

కానీ 99 సినిమాలు చేసిన టాప్ హీరోకు పెద్ద హిట్ ఇచ్చిన క్రిష్ ను చూస్తే అసూయగా ఉందన్నారు. ట్రైలర్ చూశాక సినిమా హిట్ పై నమ్మకం కలిగిందని రాజమౌళి చెప్పారు. సినిమా చూశాక శాతకర్ణి ని బాగా తీసిన క్రిష్ ను అభినందించానన్నారు. ఇంత తక్కువ సమయంలో ఇంత అద్భుతంగా తీసిన క్రిష్ నువ్ గ్రేట్ అని రాజమౌళి ప్రశంసించారు.

రాజమౌళి –క్రిష్ చెప్పిన ఆసక్తికర అంశాలు కింద వీడియోలో చూడొచ్చు..

To Top

Send this to a friend