క్యాథరీన్ స్పెషల్ డ్యాన్స్ !!


సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ లు కథానాయికలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో ముద్దుగుమ్మ క్యాథరీన్ కూడా ఈ చిత్రంలో ఆడిపాడనుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ” అన్నపూర్ణ స్టూడియోస్ లో కళా దర్శకుడు సాహి సురేష్ వేసిన ప్రత్యేకమైన సెట్ లో క్యాథరీన్-బెల్లంకొండ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో ఓ స్పెషల్ సాంగ్ ను చిత్రీకరించనున్నాం. దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన ఈ సూపర్బ్ ఐటెమ్ నెంబర్ కు ప్రేమ్ రక్షిత్ డ్యాన్స్ కొరియోగ్రఫీ చేయనున్నారు. ఈ ఐటెమ్ సాంగ్ ను ఒన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా మార్చేందుకు మా డైరెక్టర్ బోయపాటి శీను స్పెషల్ కేర్ తీసుకొంటున్నారు” అన్నారు.
ఈ చిత్రానికి మాటలు: ఎం.రత్నం, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ, కళ: సాహి సురేష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, స్టిల్స్: జీవన్, పోస్టర్ డిజైన్స్: ధని ఏలె, ప్రెస్ రిలేషన్స్: వంశీ-శేఖర్, పోరాటాలు: రామ్ లక్ష్మణ్, నిర్మాణం: ద్వారకా క్రియేషన్స్, నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: బోయపాటి శ్రీను!

To Top

Send this to a friend