కోలీవుడ్ లో మార్పు.. టాలీవుడ్ లో ఎప్పుడో.?

మొన్న సంక్రాంతికి తెలుగులో టాప్ హీరోలైన చిరంజీవి, బాలక్రిష్ణలు తమ సినిమా ఖైదీ, శాతకర్ణిలు విడుదల చేశారు. ఆ సమయంలోనే కంటెంట్ ఉన్న ఆర్. నారాయణమూర్తి సినిమా ‘పోలీస్ వెంకట్రామయ్య’ విడుదలైంది. కానీ థియేటర్లే లేక పాపం సినిమా ఆడలేదు. దీంతో మంచి కథా కథనం ఉన్నా టాలీవుడ్ లో ఆ సినిమాను తొక్కేశారు. కానీ ఇలా తమిళనాడులో పరిస్థితులు లేవు. కాదు కాదు.. లేకుండా చేశాడు ఒకే ఒక్కడు.. హీరో విశాల్..

అప్పటివరకు తమిళ సినీ కళాకారుల సంఘం నటుడు శరత్ కుమార్-రాధిక చేతుల్లో ఉండేది. వారు ఆడిందే ఆట పాడిందే పాట.. కానీ విశాల్ శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మీని ప్రేమించడం.. ఆ ప్రేమ పెళ్లికి శరత్-రాధిక ఒప్పుకోలేదు. నువ్ తమిళోడివి కాదు తెలుగోడివి అని తిట్టిపోశారు. దీంతో వీరి ఆగడాలకు మండిపోయిన విశాల్.. శరత్ కుమార్ అధికారం పై కొట్టాడు. అప్పటివరకు భ్రష్టు పట్టిపోయిన నడిగర్ సంఘం ఎన్నికల్లో నాజర్ ,కార్తి సాయంతో విశాల్ పోటీపడ్డాడు. నిజాయితీగా కళాకారులను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. మార్పు తెస్తానన్నారు. దీంతో గెలిచాడు. ఇప్పుడు తమిళనాడు నిర్మాతల మండలి నూతన కార్యవర్గం ఎన్నికల్లోనూ ఘనవిజయం సాధించి అధ్యక్షుడిగా విజయం సాధించారు.

విశాల్ గెలవగానే తమిళనాట విప్లవాత్మక మార్పులు వచ్చాయి. కళాకారులకు నెలవారీ పింఛన్ అమలైంది. కళాకారులకు కమ్యూనిటీ భవనాలు, ఇళ్లు కట్టించారు. పేద కళాకారులను ఆదుకున్నారు. అంతే కాదు చిన్న సినిమాలను ప్రోత్సహించి థియేటర్లను ఇప్పించారు. ఇలా తమిళ సిని పరిశ్రమ రూపురేఖలే మార్చేశారు విశాల్..

కానీ తెలుగులో ఈ స్ఫూర్తి కొరవడింది. విశాల్ స్ఫూర్తితో ముందుకొచ్చిన నటుడు రాజేంద్రప్రసాద్ అనుకున్న స్థాయిలో పనులు చేయలేదు. మిగతా నటులు ఆ బాద్యత తలకెత్తుకున్నా సమర్థంగా నిర్వహించడం లేదు. దీంతో తమిళనాట మారిన సంస్కరణలు తెలుగునాట విఫలం అయ్యాయి. విశాల్ లాంటి నటుడు ఎప్పుడు వస్తాడో.. ఎప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుందో వేచి చూడాల్సిందే..

To Top

Send this to a friend