కోరమీసాలు.. పంచెకట్టు.. కాటమరాయుడు సంచలనం..

మాస్.. పక్కా మాస్… కాదు కాదు ఊరమాస్.. పవన్ తన అభిమానులకు ఏదీ కావాలో అదే ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తమిళ ‘వీరమ్’ రిమేక్ గా రూపొందుతున్న ‘కాటమ రాయుడు’ టీజర్ రిలీజ్ అయ్యింది. విడుదలైన ఒక్కరోజులోనే 44 లక్షల మంది ఈ ట్రైలర్ ను చూశారు. ఇదో రికార్డు .. ఇలా ఒక్కరోజులోనే ఇన్ని వ్యూస్ వచ్చిన తెలుగు చిత్రం మరోటి లేదట..
పవన్ కాటమరాయుడు సినిమా ఫుల్ మాస్ ఎంటర్ టైనర్.. సినిమాలో పంచెకట్టుతో ఓర మీసాలతో కత్తిలాంటి చూపులతో పవన్ మేనరిజం అదుర్స్ గా ఉంది.. ముగ్గురు తమ్ముళ్లు శివబాలాజీ, కమల్ కామరాజు, చైతన్యకృష్ణలకు అన్నయ్యగా పవన్ నటించారు. గబ్బర్ సింగ్ తర్వాత శృతి హాసన్ తో కలిసి నటించారు. కిశోర్ కుమార్ పార్థసాని దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి శరత్ మరార్ నిర్మాత.. నిన్న ఆదివారం రిలీజ్ అయిన ట్రైలర్ అద్బుతంగా ఉంది. పవన్ ఫైట్స్ దుమ్మురేపాయి. డైలాగ్స్ అదుర్స్ అంటున్నారు ప్రేక్షకులు.. వర్షంలో గొడుగుపట్టుకొని నిలబడ్డ పవన్ స్టైల్ కు అభిమానులు ఊగిపోతున్నారు. విడుదలైన ఒక్కరోజులోనే 40 లక్షల మంది జనం చూసిన ట్రైలర్ మున్ముందు ఇంకా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.. ట్రైలర్ చూశాక పవన్ కాటమరాయుడుపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమాను మార్చి నెలాఖరులో విడుదల చేయాలని చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తోంది.. టీజర్ చూశాక సినిమా రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది..
పవన్ కాటమరాయుడు టీజర్ ను కిందచూడొచ్చు..

To Top

Send this to a friend