కోదండ.. ఎందుకయ్యా ఇంకా ఉద్యమాలు..

తెలంగాణ సాధించిన క్రెడిట్ ఎవరిదీ.. 2001 లో తెలంగాణ రాష్ట్రసమితిని స్థాపించి దాదాపు 15 ఏళ్లు కొట్లాడిన కేసీఆర్ దా.. లేక కేసీఆర్ ఆలోచనల్లోంచి పుట్టిన జేఏసీకి చైర్మన్ గా వ్యవహరించిన కోదండ రాం దా..? అంటే తెలంగాణ సమాజం మొత్తం కేసీఆర్ కే ఓటు వేస్తోంది. తెలంగాణలోని యావత్ సమాజాన్ని, ప్రతిపక్షాలను, అన్ని పక్షాలను ఏకం చేసి తెలంగాణ సాధించాలని కేసీఆర్ జేఏసీ ఏర్పాటు చేశారు. దానికి ఎలాంటి విభేదాలు లేని.. అందరికీ అనుకూలురు అయిన ప్రొఫెసర్ కోదండరాంను నియమించారు. ఆయన కేసీఆర్ అనుకున్నట్టే అన్నిపక్షాలతో పోరాడి తెలంగాణ సాధించడంలో కీరోల్ పోషించారు.
తెలంగాణ ధర్మయుద్ధంలో శ్రీకృష్ణుడు కేసీఆర్ అయితే.. అర్జునుడు కోదండరాం లాంటి వాడు. అందుకే వెనుకలా ఎన్నో వ్యూహాలు పన్నిన కృష్ణుడు కేసీఆరేనే తెలంగాణ సమాజం గుర్తించింది. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినా ఆ ఎంపీలు పార్లమెంటులో పెప్పర్ స్ర్పేకు గురిఅయినా కూడా తెలంగాణ సమాజం తెలంగాణ కోసం దాదాపు 15 ఏళ్లు కొట్లాడి.. కాంగ్రెస్ కు తెలంగాణ ఇచ్చేటట్టు చేసిన కేసీఆర్ కే ఓటేశారు .. గెలిపించారు. ఆయన ప్రజల ఆమోదం పొందిన సీఎంగా పీఠమెక్కారు..
మరి ఇంతలా ఆదరించిన కేసీఆర్ ను ఒకప్పుడు ఆయన వెంట నడిచిన కోదండరాం ఇప్పుడు ఎందుకు విమర్శిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణను ఎందుకు ఆగమాగం చేస్తున్నారు. కేసీఆర్ ప్రజాకర్షక పథకాలకు టీడీపీ దుకాణం బంద్ అయ్యింది. కాంగ్రెస్ లోని మేధావులంతా టీఆర్ఎస్ లో చేరారు. సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ ముందుంది. ఒక్కో సమస్యను చాకచక్యంగా పరిష్కరించుకుంటూ వస్తున్న కేసీఆర్ … ఇప్పుడు కోదండరాం ఆందోళన చేస్తున్న నిరుద్యోగుల సమస్యలపై కూడా దృష్టిపెట్టారు. టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు వేస్తున్నారు. గురుకులం నోటిఫికేషన్ విడుదలైంది కూడా. ఇప్పటికీ సింగరేణి, విద్యుత్, ఆర్టీసీ తదితర సంస్థల్లో నియామకాలు  జరిగాయి. రాబోయే 2 ఏళ్లలో 75000 వేల నియామకాలు చేస్తానని కేసీఆర్ ప్రకటించారు . ఇక కొత్త జిల్లాల వల్ల ఇంకొన్ని ప్రభుత్వ ఉద్యోగాలు పెరిగాయి. కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ముందుకు వెళుతోంది..
ఇలాంటి సమయంలో ప్రభుత్వానికి ప్రభుత్వానికి తగినంత సమయం ఇవ్వకుండా ..కేసీఆర్ వెంట నడవకుండా ప్రశాంతంగా ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులను కావాలని రెచ్చగొడుతున్న కోదండరాం వైఖరి పై అందరూ మండిపడుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు కోదండరాం వల్ల జాప్యం అయ్యే సూచనలు ఉన్నాయి.  కోదండ రాం చేపట్టిన నిరుద్యోగ ర్యాలీ వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టమేం లేదు. కానీ కోదండరాం వల్ల నిరుద్యోగులకే నష్టం.. ఆయనను వీడి చదువుకుంటే మీ బతుకులే బాగుపడతాయి..
To Top

Send this to a friend