కోదండకు వ్యతిరేకంగా రా.. 2 లక్షలిస్తా..


రాజకీయాలు తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు. తమకు కొరకరాని కొయ్యగా మారిన నేతల్ని అభాసుపాలు చేయడానికి డబ్బును వెదజల్లుతారు. తెలంగాణలో ఇప్పుడు అదే జరుగుతోంది.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న కోదండరాంను అణిచివేయడానికి తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయా..? కోదండను బ్లేమ్ చేసి జేఏసీని విచ్చిన్నం చేయడానికి కుట్రలు కొనసాగుతున్నాయా.? అందుకే జేఏసీ కన్వీనర్ గా ఉన్న పిట్టల రవీందర్ అందులోంచి బయటకు వచ్చి కోదండరాంపై విమర్శలకు దిగుతున్నారా..? పిట్టల వెనుక ఉండి డబ్బు సాయం చేస్తూ ఆయన్ను ఉసిగొల్లుతున్నది ఎవరు…? అసలు కోదండరాంపై ఈ కుట్రకు బాధ్యులు ఎవరు అనే ప్రశ్నలకు బలమైన ఆధారాలు లభించాయి.

ఇటీవల కోదండరాం వైఖరి నచ్చక జేఏసీ కన్వీనర్ గా ఉన్న పిట్టల రవీందర్ బయటకు వచ్చారు. కోదండ వైఖరిపై దుమ్మెత్తి పోశాడు. కోదండ కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో అంటకాగి జేఏసీని నాశనం చేస్తున్నాడని.. రాజకీయ పార్టీ పెట్టి టీఆర్ఎస్ ఓడగొట్టాలని చూస్తున్నాడని.. దీనివెనుక కాంగ్రెస్, ఇతర పార్టీల రెడ్లు కీలక పాత్ర పోశిస్తున్నారని.. కోదండరాం విదేశాలకు పోయినప్పుడు రహస్య మంతనాలు జరిపారని సంచలన విషయాలను రవీందర్ బయటపెట్టారు. ఇన్నాళ్లు జేఏసీ చైర్మన్ తో సన్నిహితంగా ఉండి పోరాడిన పిట్టల ఇప్పుడు ఇలా కోదండపై విమర్శలకు దిగడం సంచలనం రేపింది.

కాగా పిట్టల రవీందర్ బయటకు రావడం.. కోదండపై విమర్శలకు దిగడం వెనుక లాబీయింగ్ పనిచేసిందని సమాచారం. అందుకే ఆయన కోదండకు వ్యతిరేకంగా జనాలను సమీకరించే పనిలో భాగం గా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నేతను హైదరాబాద్ కు రావాలని.. అక్కడ కోదండకు వ్యతిరేకంగా ఉద్యమించాలని ఫోన్లో మాట్లాడారు. అందులో నీకు అవసరమైతే వడ్డీ లేకుండా రెండు లక్షలిస్తా.. వాడుకో తరువాత మెల్లిగా ఇద్దువు కానీ అని మాట్లాడాడు. ఈ ఆడియో వెలుగుచూడడంతో పిట్టల ఇరకాటంలో పడ్డాడు. సామాన్య జేఏసీ నాయకుడు లక్షలు ఇచ్చి కోదండకు వ్యతిరేకంగా కూటమి కడుతున్నాడంటే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అతడి వెనుక ఎవరో ఉండి నడిపిస్తున్నారని దీన్ని బట్టి అర్థమవుతోంది..

పిట్టల రవీందర్ ఓ జేఏసీ నాయకుడితో కోదండరాంకు వ్యతిరేకంగా జరిపిన లాబీయింగ్ ఆడియోను కింద వినొచ్చు..

AUD-20170312-WA0004

To Top

Send this to a friend