కోడెల మహిళాభ్యుదయం… కోడలు కన్నీటి పర్యంతం

అమరావతిలో జరిగిన మహిళా పార్లమెంటు సదస్సుకు ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అధ్యక్షత వహించారు. మహిళల గురించి.. వారికి జరుగుతున్న అన్యాయాల గురించి ఊదరగొట్టారు. అంతకుముందు ఓ సందర్భంలో ‘మహిళలు వంటింటికే పరిమితమైతే ఎలాంటి అఘాయిత్యాలు జరగవని’ నోరుజారి అనంతరం నాలుక కరుచుకొని తప్పైంది అన్నారు. అనంతరం మహిళా పార్లమెంటు సదస్సులో మహిళా మణులు గొప్పవాళ్లు అంటూ కీర్తించారు. కానీ కోడెల తన ఇంటిగుట్టుపై మాత్రం ఎక్కడా వ్యాఖ్యానించలేదు. తన కోడలుకు జరిగిన అన్యాయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. ఉపన్యాసాలు బయటివారికి చెప్పాడానికే కానీ పాటించడానికి కాదు అని ఆయనకు అర్థం అయినట్టు ఉంది. అందుకే ఆ దారునాన్ని ప్రస్తావించలేదు.
ఏపీ స్పీకర్ కోడెల మహిళాభ్యుదయం గురించి చేసిన వ్యాఖ్యలను ఊటంకిస్తూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయన దుమ్ముదులుపుతున్నారు. ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. అధికార దర్పంతో కోడెల శివప్రసాద్ చేస్తున్న ఆగడాలను, ఆయన కోడలును గెంటేసిన తీరును నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కోడెల కోడలు విలేకరుల ఎదుట వాపోయిన వీడియోను.. ఆమె కోడెలకు సంధించిన ప్రశ్నలను జోడించి సోషల్ మీడియాలో కడిగేస్తున్నారు..
సోషల్ మీడియా చాలా చురుగ్గా తయారైంది. ఎక్కడ అవినీతి, అన్యాయం జరిగినా.. ఎవ్వరూ స్పందించినా స్పందించకున్నా సోషల్ మీడియా మాత్రం స్పందిస్తోంది. వెంటనే తమ అభిప్రాయాలను చెబుతూ అన్యాయాలను కడిగిపారేస్తున్నారు. ఇలానే కోడెల-ఆయన కోడలు వ్యవహారంపై కూడా నెటిజన్లు సీరియస్ గా స్పందించారు. కోడెల కోడలు వీడియోను షేర్ చేస్తూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
కోడెల శివప్రసాద్ కోడెలు ఆవేదనను కింద వీడియోలింక్ లో చూడొచ్చు..

To Top

Send this to a friend