కొరటాల శివ విడుదల చేయనున్న “జయమ్ము నిశ్చయమ్మురా” థియేట్రికల్ ట్రైలర్ !!

koratala-siva-apnewsonline-in

ఇటీవలకాలంలో ఏ సినిమాకూ రానంత క్రేజ్ తెచ్చుకున్న చిత్రం “జయమ్ము నిశ్చయమ్మురా”. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ఈనెల 25 విడుదలకు సిద్ధమవుతోంది.

త్రివిక్రమ్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్, సుకుమార్ చేతుల మీదుగా సాంగ్ టీజర్ రిలీజ్ జరుపుకున్న ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను మరో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ విడుదల చేయనున్నారు.

ఇదే వేదికపై ప్రముఖ యువ దర్శకులు అనిల్ రావిపూడి, ప్రముఖ రచయిత వక్కంతం వంశీ “జయమ్ము నిశ్చయమ్మురా” చిత్రంలోని జీవా, పోసానిల ఫస్ట్ లుక్స్ మరియు టీజర్స్ ఆవిష్కరించనున్నారు. ఇంతకుముందు ప్రవీణ్ “తత్కాల్” ఫస్ట్ లుక్, మరియు కృష్ణ భగవాన్ “అడపా ప్రసాద్ ఫస్ట్ లుక్ ప్రముఖ కథానాయకుడు సునీల్ రిలీజ్ చేయడం తెలిసిందే.

టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ తో ఫస్ట్ లుక్స్ మరియు టీజర్స్, ట్రైలర్స్ రిలీజ్ చేయిస్తున్న “జయమ్ము నిశ్చయమ్మురా” చిత్రబృందం ఆడియోను ఎవరితో విడుదల చేయిస్తుందోనన్న క్యూరియాసిటి అందరిలోనూ నెలకుంటోంది.

శ్రీనివాస్ రెడ్డి-పూర్ణ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సతీష్ కనుమూరితో కలిసి.. శివరాజ్ ఫిలిమ్స్ పతాకంపై శివరాజ్ కనుమూరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఏ.వి.ఎస్.రాజు సమర్పిస్తున్న ఈ చిత్రం ప్రదర్శన హక్కులు ఎన్.కె.ఆర్ ఫిలిమ్స్ అధినేత నీలం కృష్ణారెడ్డి సొంతం చేసుకోగా.. వారి నుంచి నైజాం హక్కులు ప్రముఖ కథానాయకుడు నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి తీసుకోవడం తెలిసిందే!!

To Top

Send this to a friend