కొనేయండి.. టూవీలర్స్ చీప్ అయ్యాయి..


సుప్రీం కోర్టు ఆదేశాలమేరకు దేశంలో కాలుష్య కారక.. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న బీఎస్ 3 వాహనాలు ఇక నుంచి రోడ్లపై తిరగవు.. కొత్తగా తయారయ్యే వాహనాలన్నీ కాలుష్య రహిత బీఎస్ 4 వాహనాలే దేశంలో విడుదలవుతాయి. దీంతో ఈ ఒక్కరోజు మాత్రమే బీఎస్3 వాహనాలు కొనుగోలు చేయాలి. ఏప్రిల్ 1 తర్వాత కొనే అన్ని వాహనాలు బీఎస్ 4 కొనాలి.

సుప్రీం కోర్టు ఆదేశాలతో వివిధ షోరూంలలో ఉన్న బీఎస్ 3 వాహనాలకు భారీ డిస్కౌంట్ ధరల్ని కంపెనీలు ప్రకటించాయి. ప్రఖ్యాత వాహన కంపెనీలన్నీ హీరో, హోండా, బజాజ్, టీవీఎస్ లు తమ వాహనాలపై ఒక్కో బండిపై 22 వేల వరకు తక్కువ ధర ప్రకటించి అదీ ఈ ఒక్క 31న మాత్రమేనని పాత బండ్లను వదిలించుకునేందుకు ప్లాన్ చేసింది. 1 నుంచి ఈ వాహనాల ఇంజన్లను బీఎస్ 4కు మార్చి అమ్మితేనే అనుమతిస్తారు. దీంతో పాత వాహనాలను వీలైనన్నీ అమ్మేందుకు ఈ ఫ్రీ ఆఫర్లు ప్రకటించారు.

మార్చి 31లోపు కొనే బీఎస్3 వాహనాలకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి మాత్రం బీఎస్4 వాహనాలకే రిజిస్ట్రేషన్ చేస్తారు. దీంతో అన్ని కంపెనీలు వినియోగదారులను ఆకర్షించేందుకు వాహనాల రేటును సగానికి తగ్గించేశాయి. వినియోగదారుల నుంచి కూడా బాగానే రెస్పాన్స్ వస్తోంది.

To Top

Send this to a friend