కొట్లాడిన విద్యార్థులను పట్టేంచుకో సారూ..

ou-students-telangana-agitation-apnewsonline

తెలంగాణ వస్తే బతుకులు బాగుపడుతాయనుకున్నారు..? ఊరు వాడా, పల్లె పట్టణం తేడాలేకుండా ఉద్యమంలో ఉరకలెత్తారు. విశ్వవిద్యాలయాలను ఉద్యమ కేంద్రాలుగా మార్చారు. ఇంతకీ తెలంగాణ కోసం ఉద్యమించిన విద్యార్థులు కలలు గన్నది ఏంటీ.. స్వయం పాలన.. మన ఉద్యోగాలు మనకు.. నిధులు, నీళ్లు , నియామకాలు.. మరి అవి అందుతున్నాయా..? కొత్త రాష్ట్రం తెలంగాణకు ఉద్యమ రథసారథే గద్దెనెక్కారు. నీళ్ల వాటా ఇప్పుడే తేలుతోంది.. కొన్ని ఉద్యోగాలు ఇప్పుడే ప్రకటనలు వస్తున్నాయి. కానీ అంతకష్టపడ్డ విద్యార్థుల చదువుల కోసం వెచ్చించే ఫీజురీయింబర్స్ మెంటును మాత్రం ప్రభుత్వం చెల్లించకపోవడం వివాదానికి కారణమైంది..
తెలంగాణ కోసం కొట్లాడిన విద్యార్థులు ప్రభుత్వం నుంచి ఏమీ ఆశించట్లేదు.. కేవలం చదువుకోవడానికి ఫీజు రీయింబర్స్ మెంట్లు.. చదువు అయిపోయాక ఉద్యోగాలు.. ఇప్పుడు తెలంగాణలో ఈ రెండింటి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిది.. తెలంగాణ అసెంబ్లీలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంటును చెల్లించాలని ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నకు సీఎం కేసీఆర్ సమాధానం చూసి అందరూ నోరెళ్లబెట్టారు. ఉద్యమ సారథి విద్యార్థులకు పీజు రీయింబర్స్ మెంట్ విడుదల విషయంలో వాయిదాల్లోనే చెల్లిస్తామనడం వివాదానికి కారణమైంది. ప్రతిపక్షాలు సీఎం మొత్తం నిధులను విడుదల చేయాలని అసెంబ్లీలోనే భైటాయించారు. చివరకు మార్షల్స్, పోలీసులతో వారిని బయటకు పంపించారు. ఇంత జరుగుతున్నా తెలంగాణ కోసం కోట్లాడిన విద్యార్థులపైన సీఎం కేసీఆర్ కు దయ కలగడం లేదని కాంగ్రెస్, టీడీపీ నాయకులు విమర్శలు గుప్పించారు..

To Top

Send this to a friend