కేసీఆర్ విషయంలో తప్పే.. బీజేపీ నేతల పశ్చాత్తాపం.

కేసీఆర్ ప్రభంజనాన్ని తెలంగాణ టీడీపీ నేతలు ముందే ఊహించారు. కేంద్రానికి సమాచారం ఇచ్చారు. కానీ కేంద్రంలోని మోడీ, అమిత్ షాలు తెలంగాణ విషయంలో పొరపాటు చేశారు. తెలంగాణ బీజేపీ నేతల మాటల్ని పక్కనపెట్టారు. అందుకు మూల్యం చెల్లించుకున్నారు.

గడిచిన 2014 ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని ముందుకెళ్లాలని స్థానిక బీజేపీ నేతలు అధిష్టానాన్ని కోరారు. కానీ బీజేపీ పెద్దలు ఒప్పుకోలేదు. పక్కరాష్ట్రం ఏపీలో టీడీపీతో వెళ్తున్నందున.. ఇక్కడా వారితోనేనని తేల్చిచెప్పారు.. ఫలితం.. తెలంగాణలో బీజేపీకి సీట్లు రాలేదు.. అందుకే ఈసారైనా కేంద్రంలోని బీజేపీ పెద్దల్ని ఒప్పించాలని బీజేపీ కార్యవర్గ సమావేశంలో నేతలు పట్టుబట్టారు. ఇటీవలే భద్రచాలంలో జరిగిన ఆ పార్టీ నేతల సమావేశంలో ఇదేచర్చ.. 2019 ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ తో జోడీకట్టి ముందుకెళ్తే విజయం ఖాయమని .. దీనిపై బీజేపీ అధిష్టానాన్ని ఒప్పించాల్సిందేనని నాయకులు చర్చించుకున్నారట.. మోడీతో, కేసీఆర్ సాన్నిహిత్యంతో ఉండడం.. పెద్దనోట్ల రద్దు ను దేశంలోనే ముందు మద్దతు తెలిపిన కేసీఆర్ తో వెళితే బీజేపీకి లాభమని బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, దత్తాత్రేయ సహా నాయకులు నిర్ణయించారు. మరీ దీనికి కేసీఆర్ అంగీకరిస్తారా.. లేక ఒంటరిగా వెళ్తారా అన్నది తేలాల్సి ఉంది..

To Top

Send this to a friend