కేసీఆర్ వచ్చాక తెలంగాణ బాగుపడిందా.. దిగజారిందా..?

కేసీఆర్ కొన్ని పథకాలు అమలు చేయలేదు.. లాలూచీ పడ్డాడు.. అదీ కరెక్టే.. అసంతృప్తుల వాదనతో ఏకీభవిద్దాం.. మరి అమలు చేసిన వాటి సంగంతేంటి..? కేసీఆర్ తన పాలనపై ఇటీవలీ అసెంబ్లీ సమావేశాల్లో వివరంగా మాట్లాడారు.. తాను ఎన్నోసాధించాల్సి ఉన్న వాటిని విమర్శిస్తున్నారని..కానీ సాధించిన వాటిని పట్టించుకోవడం లేదని వాపోయారు.. కేసీఆర్ టాల్లో నిజాలున్నాయి.. గత పాలనతో పోల్చిచూస్తే అది మనకు కనిపిస్తుంది..

ముక్కి మూలుగుతూ ఏ ఆసరా లేని వృద్ధులకు ఉమ్మడి ప్రభుత్వాలు ఏం ఇచ్చారు. ముందు రూ.75, ఆ తర్వాత రూ.200.. ఇప్పుడు ఎంత ఇస్తున్నారు..? రూ.1000.. ఆసరా పింఛన్లను అందుకునే ముసలోళ్లు తమ ఇళ్లలో కేసీఆర్ బొమ్మ పెట్టుకుంటున్నారు.. కొడుకులు ఆదరించకపోయినా బతికేస్తాం.. కేసీఆరే మా కొడుకు అంటున్నారు.. వచ్చే సారి కారుకే మా ఓటు అంటున్నారు. ఒక్కసారి క్షేత్రస్థాయిలో అడిగితే కేసీఆర్ పాలన గురించి తెలుసుకోవచ్చు.. ఉమ్మడి పాలనలో ఆయకట్టు లేని చెరువులు కునారిల్లాయి.. కేసీఆర్ మిషన్ కాకతీయతో చెరువులు బాగు పడి.. నిండి ఈసారి కొత్తగా చెరువుల కింద దాదాపు 10 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చింది.. రైతులు బతుకులు బాగుపడ్డాయి. కిరణ్ కుమార్ రెడ్డి హాయాంలో కరెంటు కొరతతో చిన్న పరిశ్రమలు చేతివృత్తుల వారికి పనిలేక ఉపాధి కోల్పోయారు. ఇప్పుడు కేసీఆన్ నయోనో భయానో.. ఎక్కడినుంచో కరెంట్ తెచ్చి చిన్న పరిశ్రమలను, చేతివృత్తుల వారికి కరెంటిచ్చి వారి ఉపాధికి ఊతమిచ్చాడు.. కరెంట్ విజయం తెలంగాణ సాదించిన అద్భుత విజయం. కళ్యాణలక్ష్మిలో 51వేలు, భగీరథతో మంచినీరు.. కాంగ్రెస్ పథకాల కొనసాగింపు..(ఫీజు రీయింబర్స్ మెంటు), ఇప్పుడు గర్భిణులకు 15వేలు.. పథకాలు ఎన్నో కేసీఆర్ పథకాలు ప్రజలకు చేరువయ్యాయి… బాసర నుంచి ఖమ్మం దమ్ముగూడెం వరకు ఆదిలాబాద్, కరీంనగర్ లలో అనధికారికంగా పదుల సంఖ్యలో బ్యారేజీలు కడుతున్నారు. రైతులకు నీళ్లించ్చేందుకు.. పంటలు పండించుకోవడానికి.. ఈ నీరు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఇది మీడియాకు కూడా తెలియని వ్యవహారం.. అడగ్గానే రోడ్లు పడుతున్నాయి.. కోరగానే ప్రాజెక్టులకు నిధులు వస్తున్నాయి.. చిన్న జిల్లాలతో ప్రతీ కొత్త కలెక్టరేట్, రిజిస్ట్రేషన్ ఆఫీసుల వద్ద , వివిధ కార్యాలయాల వద్ద వేల మందికి కొత్తగా ఉపాధి లభించింది. అధికారుల దృష్టి ప్రజలకు చేరువయ్యింది కేసీఆర్ బడ్జెట్ ప్రభావంతో కొన్ని చేయలేదు. కానీ ఈ రెండున్నరేల్లలో భావి తెలంగాణకు బాటలు వేశాడు. పత్రికల సర్వేలో ప్రజల్లో కేసీఆర్ కు దాదాపు 85శాతం ప్రజాదరణ ఉందంటే.. కేసీఆర్ స్టామినాను అర్థం చేసుకోవచ్చు..

To Top

Send this to a friend