కేసీఆర్ ప్రతి అడుగులో మర్మముంటుంది.

‘ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు తెలివైనవాడు..’ ఇది అత్తారింటికి దారేది సినిమాలోని ఫేమస్ డైలాగ్ ఇదీ.. ఈ డైలాగ్ సీఎం కేసీఆర్ కు సరిగ్గా సూట్ అవుతుంది.. సీఎం కేసీఆర్ ను ఎంతో మంది ఎన్నో కార్యక్రమాలకు ఆహ్వానిస్తుంటారు. కానీ ఆయన అన్నింటికి హాజరు కారు.. కొన్ని కార్యక్రమాలకు తన కొడుకు అయిన కేటీఆర్ ను తన స్థానంలో పంపిస్తుంటారు. కానీ కొన్ని కార్యక్రమాలకు తప్పకుండా హాజరవుతారు. అదీ తన బాల్య స్నేహితులు, తెలంగాణకు దోహదపడే పారిశ్రామికవేత్తలు, అధికారులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఇలా కొంతమంది పండుగలకు తప్పకుండా హాజరవుతారు. తెలంగాణకు అవసరమవుతారనుకుంటే ఆయనే చొరవ తీసుకొని వేడుకలకు వెళ్తుంటారు.
సీఎం కేసీఆర్ ఆదివారం ఢిల్లీకి పయనమయ్యారు. కేంద్ర హెచ్ఆర్ మంత్రి ప్రకాష్ జవదేకర్ కొడుకు పెళ్లి ఆదివారం ఘనంగా జరిగింది. సోమవారం ఢిల్లీలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. మొదట ఈ వివాహ విందు, ప్రధాని మోడీతో భేటి కావాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం ప్రధాని అపాయింట్ మెంట్ కోరారు. కానీ ఆయన నిరాకరించడంతో ఢిల్లీ వెళ్లరాదని.. ఆదివారం కలెక్టర్లతో మీటింగ్ నిర్వహించారు. ఆ మీటింగ్ కొనసాగుతుండగానే కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ సీఎం కేసీఆర్ కు స్వయంగా ఫోన్ చేశారు. దీంతో కేసీఆర్ మనసు మార్చుకొని ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం రాత్రి 8.45 గంటలకు బయలుదేరి వెళ్లారు. పనిలో పనిగా అక్కడే 7వ తేది వరకు ఉండి రాష్ట్రపతి, కేంద్ర మంత్రులను కలువనున్నారట..
కేసీఆర్ తనకు అందివచ్చిన అవకాశాన్ని దేన్ని వదులుకోరు.. కేంద్ర హెచ్ఆర్ మంత్రి ప్రకాష్ జవదేకర్ కు ఈ మధ్యే ప్రమోషన్ వచ్చింది. హెచ్ఆర్ వ్యవహారాలతోపాటు రెండు మూడు కీలక శాఖలకు అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విద్యా శాఖ ఆయన దగ్గరే ఉండడంతో తెలంగాణ మోడల్ స్కూల్స్, గురుకులాలు దాంతో పాటు హరితహారం పలు పథకాలకు నిధులు విడుదలలో జవదేకర్ సహకరించారు. అందుకే భవిష్యత్ లో మంత్రితో సాన్నిహిత్యం తెలంగాణ శ్రేయస్సుకు ఉపయోగపడుతుందని కేసీఆర్ ఢిల్లీ బాటపట్టారు. ఇదే కాదు రాష్ట్రంలోనూ కేసీఆర్ ఇదే వైఖరితో ఉంటారు. తనకు బాగా దగ్గరైనా.. కావాలసిన .. ఉపయోగపడే కార్యక్రమాలకే హాజరై తాను ఢిఫెరెంట అని నిరూపించుకుంటారు..

To Top

Send this to a friend