కేసీఆర్ పై బాలయ్య ప్రేమ.. ప్రత్యేక షో

Balakrishna

బాలక్రిష్ణ నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి మూవీకి తెలంగాణ , ఏపీ ప్రభుత్వాలు పన్ను మినహాయింపులు ఇచ్చాయి. దీనిపై ఇప్పటికే ఏపీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన బాలక్రిష్ణ.. ఈరోజు తెలంగాణ అసెంబ్లీకి వచ్చారు. సీఎం కేసీఆర్ ను కలిసి పన్ను మినహాయింపు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలపడానికి వచ్చినట్టు తెలిపారు. అయితే సీఎం కేసీఆర్ అసెంబ్లీనుంచి ప్రగతి భవన్ కు వెళ్లడంతో మంత్రి తలసానితో కలిసి బాలయ్య సీఎం ఇంటికి పయనమయ్యారు. కాగా సీఎం కేసీఆర్ ను శాతకర్ణి మూవీ ప్రీమియర్ షో చూసేందుకు ప్రత్యేకంగా రావాలని బాలయ్య కోరారు. ఒక వేళ సమయం లేకపోతే సినిమా ప్రింట్ ను ఇస్తామని చూడాలని కోరారు. దీనికి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.

అంతకుముందు తెలంగాణ అసెంబ్లీకి వచ్చిన బాలయ్యకు టీడీపీ ఫ్లోర్ లీడర్ రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. వెల్ కం టు తెలంగాణ అసెంబ్లీ అని రేవంత్ బాలయ్యను ఆహ్వానించగా.. ‘తాను కళాకారుడిని అని.. కళకు ప్రాంతాలకు సంబంధం లేదని.. తెలంగాణ, ఆంధ్రా నాకు రెండు కళ్లు ఇకనుంచి తనను ప్రాంతీయుడిగా వేరుచేయవద్దని రేవంత్ తో అన్నారు. అనంతరం సీఎం లేరని తెలియడంతో సీఎం ఇంటికి పయనమయ్యారు. ఇలా తన సినిమాకు పన్ను మినహాయింపు నిచ్చిన బాలయ్య కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపేందుకు స్వయంగా రావడం గమనార్హం..

To Top

Send this to a friend