కేసీఆర్ పంచప్రాణాలు ఎవరో తెలుసా..?

తెలంగాణ కోసం కొట్లాడి.. చివరకు ప్రాణాలకు తెగించి రాష్ట్రాన్ని సాధించాక కేసీఆర్ బాగా సైలెంట్ అయ్యారు. మునుపటి ఉద్యమ వాడి, వేడి బాగా తగ్గించారు.అంతకుముందు ఆంధ్రా నాయకులు ఎవ్వరు విమర్శించినా.. తెలంగాణకు అన్యాయం జరిగినా ఉవ్వెత్తున ఎగిసి ప్రత్యర్థులకు దిమ్మదిరిగేలా ఆరోపణలు చేసే కేసీఆర్ తెలంగాణ వచ్చాక బాగా నెమ్మదించారు.

తెలంగాణ వచ్చిన కొత్తలో రాష్ట్రాన్ని పట్టాలెక్కించేందుకు పలు ప్రయత్నాలు చేశారు. వ్యూహాలు పన్నారు. ముందు ప్రభుత్వాన్ని సుస్థిరం చేసేందుకు నాయకులను టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. అనంతరం దేశం ఆకర్షించేలా పలు అద్భుత పథకాలను ప్రవేశపెట్టి తెలంగాణను వృద్ధిరేటులో దూసుకుపోయెటట్లు చేస్తున్నారు. 19.5 శాతం వృద్ధిరేటుతొ ప్రస్తుతం తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉందంటే అది కేసీఆర్ పథకాల చలువే.. సంవత్సరం తిరిగేసరికి తెలంగాణలో పార్టీని.. పాలనను గాడిలోపెట్టిన కేసీఆర్ ఆ తరువాత చాలా బాధ్యతలను దించేసుకున్నారు. హైదరాబాద్ మహానగర పాలక ఎన్నికలను కొడుకు కేటీఆర్ కు అప్పగించి సేదతీరారు. పెద్దగా జిల్లాల పర్యటనకు కూడా వెళ్లడం లేదు. అంతా ఇంట్లోనే కూర్చొని అదికారులు, మంత్రులను రమ్మని సమీక్షిస్తూ పనులను, పాలనను వేగవంతం చేస్తున్నారు..

ప్రస్తుతం రెండున్నర తెలంగాణ పాలన ముగిశాక.. ఇన్నాళ్లు తాను ఉద్యమంలో, రాజకీయంలో పడి కోల్పోయిన సరదాలను, కుటుంబ బంధాలను కేసీఆర్ ప్రస్తుతం అనుభవిస్తున్నారు. ప్రభుత్వ పాలనలో కేటీఆర్, హరీష్ లకు అప్పగించేసి.. అధికారులను పురమాయిస్తూ మంత్రులతో కమిటీలు వేసి చక్కదిద్దుతూ కేసీఆర్ ఇంటికే పరిమితమవుతున్నారు. తాను కోల్పోయిన కుటుంబం బాంధవ్యాలను ప్రస్తుతం అనుభవిస్తున్నారు..

కేసీఆర్ కు తన మనవడు.. కేటీఆర్ కొడుకు హిమాన్షు అంటే చాలా ఇష్టం.. తాత కేసీఆర్ తన సొంతూరు సిద్దిపేట మడకశిర వెళ్లినా.. ఎదైనా చారిత్రక ప్రదేశానికి వెళ్లినా.. లేక.. క్రిస్ మస్, రంజాన్ ఇఫ్తార్ విందులు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు వెళ్లిన మనవడు హిమాన్షును తప్పక తీసుకెళ్తారు. మనవడితో తన జ్ఞాపకాలను పంచుకుంటారు. కేసీఆర్ ఇంట్లో ఆయన తర్వాత బాగా ఇష్టమైన వ్యక్తి హిమాన్షునేనట..

ఇక కేసీఆర్ కు మనవడు అంటే ఇష్టం. మరి కేసీఆర్ అంటే ఇంట్లో ఎవరికి ఇష్టమనే కదా మీ ఫీలింగ్.. కేసీఆర్ కూతురు కవితకు నాన్న కేసీఆర్ అంటే పంచప్రాణాలు.. కేసీఆర్ బర్త్ డే సందర్భంగా కేటీఆర్ ఇంటికే పరిమితమై చిన్న చిన్న సంబరాల్లో పాల్గొనగా.. ఎంపీ కవిత మాత్రం నాన్నపై ప్రేమతో తెలంగాణ భవన్ లో ఘనంగా కేసీఆర్ బర్త్ డే నిర్వహించారు. కేసీఆర్ చిన్నప్పటి ఫొటోసెషన్ లో పాల్గొని యువకుడిగా ఉన్న కేసీఆర్ బొమ్మను చూసి ఉబ్బితబ్బిబ్బయ్యారు. నాన్న అంటే తనకు ప్రాణమని చెప్పుకొచ్చారు. ఇలా కేసీఆర్ 20 ఏళ్ల రాజకీయంలో కోల్పోయిన బంధాలను ఇప్పుడు తనవితీరా అనుభవిస్తున్నారు.

To Top

Send this to a friend