కేసీఆర్ చెప్పిన భయంకర నిజాలు..

kcr-apnewsonlinein

తెలంగాణను సస్యశ్యామలం చేద్దామని భారీ ప్రాజెక్టులు చేపట్టిన కేసీఆర్ కు ఒక్కప్రాజెక్టు మాత్రం కంట్లో నలుసులా తయారైంది.కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులను త్వరిత గతిన పూర్తి చేస్తున్న సర్కారు సీఎం కేసీఆర్ సొంత జిల్లా మెదక్ లో నిర్మించతలపెట్టిన మల్లన్నసాగర్ విషయంలో మాత్రం చాలా ఆటంకాలు ఎదురయ్యాయి. ప్రతిపక్షాలన్నీ కట్టుకట్టుకొని వచ్చి మల్లన్నసాగర్ బాధితులతో ఆగమాగం చేశారు. పోలీస్ పికెట్లు, లాఠీచార్జీలు, అరెస్ట్ లు నడిచాయి.. అసలు దీని వెనుక ఏం జరిగింది. ఎవరు కారుకులో కేసీఆర్ శాసనసభ సాక్షిగా ప్రతిపక్షాల వైఖరిని తూర్పార పట్టారు.
సీపీఐ, సీపీఎం, టీడీపీ, వామపక్షాలు మల్లన్నసాగర్ నిర్వాసితులను రెచ్చగొట్టి మరీ ప్రభుత్వంపై ఫైటింగ్ కు పంపించారని కేసీఆర్ ధ్వజమెత్తారు.. సూదులు, గుండుపిన్నులు, దబ్బునంలు పట్టుకొని పోలీసులను రెచ్చగొట్టి దాడులకు దిగుతున్నారు. దానివల్ల పోలీసులు కాల్పులు జరిపి అల్లకల్లోలం జరపడానికి ప్రతిపక్షాలు కుట్రపన్నాయని కేసీఆర్ సభాముఖంగా కడిగిపారేశారు. కానీ వేగుల ద్వారా సమాచారం అందుకొని ప్రతిపక్షాలను తుత్తునియలు చేశామని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఇంత భయంకర కుట్రలు జరిగాయని.. కేసీఆర్ ఆగ్రహంగా ప్రసంగించారు.

To Top

Send this to a friend