కేసీఆర్ కు షాక్ ఇచ్చిన మోడీ..

ప్రధాని మోడీకి, కేసీఆర్ కు ఈ మధ్య కాస్త చెడింద? బీజేపీ నాయకత్వంతో చాలా రోజులుగా సన్నిహితంగా ఉంటున్న కేసీఆర్ కు షాక్ ఇచ్చారు మోడీ.. ఇటీవల ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన అఖిలపక్షం ఢిల్లీకి వెళ్లాలని ప్లాన్ చేశారు. దీనికోసం మోడీ అపాయింట్ మెంట్ కూడా తీసుకున్నారు. అంతలోనే ఏం జరిగిందో కానీ.. కేసీఆర్ అపాయింట్ మెంట్ ను మోడీ తిరస్కరించారు. దీంతో కేసీఆర్ మోడీని కలవకుండా నిన్న ఢిల్లీ టూర్ ముగించుకొని రావాల్సి వచ్చింది.. ఈ పరిణామాలపై కలత చెందిన టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో మోడీని నిలదీశారు. పార్లమెంటు సమావేశాలను రెండు రోజులపాటు బహిష్కరించారు. ఇంత వేడిగా ఉన్న పరిస్థితుల్లో కేసీఆర్ కు అపాయింట్ మెంట్ ను రద్దు చేసి తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వంకు ప్రధాని అపాయింట్ ఇవ్వడాన్ని కూడా టీఆర్ఎస్ ఎంపీ జితెందర్ రెడ్డి తప్పుపట్టారు. తమ సీఎంను కాదని పన్నీర్ తో మాట్లాడతారా.. మావి సమస్యలు కావా అని పార్లమెంటు లో ప్రశ్నించారు.

కాగా కొద్దికాలంగా కేసీఆర్, ప్రధాని మోడీతో క్లోజ్ గా ఉంటున్నారు. ఇటీవల నోట్ల రద్దు అంశంపై కూడా మొదట పాజిటివ్ గా స్పందించింది కేసీఆరే.. మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు రాబోయే రోజుల్లో బాగుంటాయని పదేపదే చెప్పే కేసీఆర్ కే ఇలా మోడీ షాక్ ఇవ్వడంతో టీఆర్ఎస్ శ్రేణులు కంగారుపడుతున్నాయి

To Top

Send this to a friend