కేసీఆర్ కు జానారెడ్డి పెట్టేది పప్పు.. పులుసేనా..?

jana-reddy-kcr-apnewsonline

సెటైర్లు వేయడంలో కేసీఆర్ కు సాటి ఎవరూ లేరని మరో ఘటన రుజువుచేసింది.. రాజకీయాల్లో మాటల మరాఠీలు కొందరే ఉంటారు.. వారు మాట్లాడితే ఉడుకు రక్తం ఉప్పొంగుతుంది.. అదే సమయంలో వారు వేసే సైటెర్లకు కడపు చెక్కలయ్యేలా నవ్వొస్తుంది.. తెలంగాణ శాసన సభ వేదికగా మంగళవారం అదే చోటుచేసుకుంది.. 150 గదుల ఇళ్లును కేవలం 8 నెలల్లో కట్టుకున్న కేసీఆర్ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి విమర్శిస్తే కేసీఆర్ సీరియస్ అయ్యాడు.. అది కేసీఆర్ ఇల్లు కాదు.. తెలంగాణ ముఖ్యమంత్రి ఇళ్లు అని.. దేశం, ప్రపంచంలోని ఎవరు వచ్చినా తెలంగాణ సీఎం నివాసం ప్రగతి భవన్ లో మన మర్యాదలు తెలుస్తాయంటూ తీవ్రంగా స్పందించారు..
అంత సీరియస్ తర్వాత సభలో జానారెడ్డి వింధు బోజనం టాపిక్ ఆద్యంతం నవ్వులు పూయించింది.. సీఎం కేసీఆర్ బోజనానికి తనను పిలవలేదని. . ఆయన తిని వచ్చి నింపాదిగా కూర్చున్నాడని జానారెడ్డి అనగా.. కేసీఆర్ మాంచి సెటైర్ వేశారు.. ‘ముఖ్యమంత్రిగా అధికార పార్టీ నేతగా ప్రతిపక్ష జానారెడ్డి ఇంటికి త్వరలోనే వస్తానని.. ఎవ్వరూ అపార్థం చేసుకోవద్దని.. జానారెడ్డి పప్పు,. పులుసు పెట్టినా తింటానని’సెలవిచ్చాడు.. దీంతో సభ నవ్వులతో ముంచెత్తింది.. సీఎం ఇంటికొస్తానంటే ఎవ్వరైనా ఓ మేకను కోసి భారీ విందు ఇస్తారు.. మరీ జానారెడ్డి లాంటి గొప్ప ప్రధాన ప్రతిపక్ష నేత పప్పు పులుసు పెడతాడని సభలో కేసీఆర్ అనడంతో జానారెడ్డి ముక్కన వేలేసుకోవడం కనిపించింది.. వింధు బోజనమో పప్పో పులుసో కానీ జానా మళ్లీ స్పందించకపోవడం గమనార్హం..

To Top

Send this to a friend