‘కేశవ’ రివ్యూ

రేటింగ్‌ : 2.5/5.0

బ్యానర్‌ : అభిషేక్‌ పిక్చర్స్‌
సంగీతం : సన్నీ
దర్శకుడు : సుధీర్‌ వర్మ
నిర్మాత : అభిషేక్‌
విడుదల : మే 19, 2017

స్టారింగ్‌ : నిఖిల్‌, రీతూ వర్మ, ఇషా కొప్పికర్‌, వెన్నెల కిషోర్‌, రావు రమేష్‌, అజయ్‌, బ్రహ్మాజీ మొదలగు వారు.

విభిన్న కథాంశాలను ఎంచుకుని, తన ప్రతి సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న నిఖిల్‌ మరో విభిన్న ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గతంలో తనకు ‘స్వామిరారా’ చిత్రంతో సక్సెస్‌ ఇచ్చిన సుధీర్‌ వర్మతో నిఖిల్‌ మరోసారి జత కట్టాడు. మొదటి నుండి ఆసక్తి రేపుతున్న ఈ సినిమా ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథలోకి వెళితే : లా స్టూడెంట్‌ అయిన కేశవ(నిఖిల్‌) వరుసగా పోలీస్‌లను హత్య చేస్తూ ఉంటాడు. ఆ హత్యల వెనుక ఒక కారణం ఉంటుంది. కేశవ ఎన్ని హత్యలు చేసినా కూడా ఒక్క చిన్న క్లూ కూడా పోలీసులకు దొరకకుండా చేస్తాడు. హత్యల వెనుక మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక ఆఫీసర్‌గా షర్మిల(ఇషా కొప్పికర్‌)ను పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ నియమిస్తుంది. ఆమె ఎలా కేసును ఛేదిస్తుంది, కేశవ ఆ హత్యలు ఎందుకు చేస్తున్నాడు అనేది మిగిలిన కథాంశం.

నటీనటుల ఫర్ఫార్మెన్స్‌ : ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిఖిల్‌ నటించి ఆకట్టుకున్నాడు. ఎప్పుడు సీరియస్‌గా ఉంటూ, తన పాత్ర ఫీలింగ్స్‌ను చూపించడంలో నిఖిల్‌ పూర్తి సక్సెస్‌ అయ్యాడు అని చెప్పుకోవచ్చు. నిఖిల్‌ బాడీ లాంగ్వేజ్‌ మరియు అతడి డైలాగ్‌ డెలవరీ కూడా ఆకట్టుకున్నాయి. హీరోయిన్‌ రీవూ వర్మకు పెద్దగా స్కోప్‌ దక్కలేదు. ఇక ఇషా కొప్పికర్‌ తన పాత్రకు న్యాయం చేసింది. మిగిలిన వారు కూడా వారి పాత్రల పరిధిలో నటించి మెప్పించారు.

సాంకేతికపరంగా: సినిమాలో కేవలం రెండే పాటలున్నాయి. అవి కూడా సందర్బానుసారంగా వచ్చేవే. ఇక బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సినిమా స్థాయిని పెంచేలా బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఉంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. కొన్ని సీన్స్‌ను సినిమాటోగ్రఫీతో స్థాయిని పెంచారు. ఎడిటింగ్‌లో చిన్న చిన్న లోపాలు మినహా అంతా బాగానే ఉంది. దర్శకుడు సుధీర్‌ వర్మ ఒక మంచి సబ్జెక్ట్‌ను ఎంచుకున్నాడు. అయితే దాన్ని పూర్తి స్థాయి కథగా మల్చడంలో, ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించడంలో తన ప్రావిణ్యం చూపించడంలో విఫలం అయ్యాడు. నిర్మాణాత్మక విలువలు పర్వాలేదు అన్నట్లుగా ఉన్నాయి.

విశ్లేషణ: నిఖిల్‌ సినిమా అనగానే ప్రేక్షకుల్లో ఒక అంచనా, ఆసక్తి కలుగుతుంది. ఇక ‘స్వామిరారా’ కాంబినేషన్‌ అనగానే మరింతగా అంచనాలు పెరిగాయి. ఒక విభిన్న సబ్జెట్‌తో దర్శకుడు తెరకెక్కిస్తున్నట్లుగా మొదటి నుండి చెప్పుకొచ్చాడు. ఆయన చెప్పినట్లుగానే విభిన్న కాన్సెప్ట్‌ అయినా, పూర్తి కథను చూస్తే మాత్రం పరమ రొటీన్‌ రివేంజ్‌ డ్రామా ఉన్నట్లుగానే ఉంది. వెన్నెల కిషోర్‌ కామెడీ తప్ప సినిమాలో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కనిపించడం లేదు. నిఖిల్‌ ట్యాలెంట్‌ను బాగానే వాడుకున్నాడు. అయితే స్క్రీన్‌ప్లేను మరింత ఆసక్తికరంగా నడిపించి ఉంటే బాగుండేది.

ప్లస్‌ పాయింట్స్‌ :
నిఖిల్‌ నటన,
ఇషా కొప్పికర్‌,
వెన్నెల కిషోర్‌ కామెడీ,
ఇంటర్వెల్‌ ముందు సీన్స్‌.

నచ్చనివి :
కథ, స్క్రీన్‌ప్లే,
కమర్షియల్‌ పాయింట్స్‌ లేక పోవడం,
దర్శకత్వం.

చివరగా : ‘కేశవ’ ఆశించిన స్థాయిలో లేదు.

To Top

Send this to a friend