కేరీర్ ను నాశనం చేసుకుంటున్న రాజ్ తరుణ్!

శతమానం భవతి.. ఈ శుక్రవారం విడుదలైన నేను లోకల్. ఈ రెండు సినిమాల్లో ముందుగా హీరోగా అనుకున్న పేరు రాజ్ తరుణ్.. దిల్ రాజు ఏరికోరి నేను లోకల్ సినిమాకు రాజ్ తరుణ్ సూట్ అవుతాడని సంప్రదించాడట.. కానీ మన వాడు కథ లో ఇన్వాల్వ్ కావడం.. కొంచెం కథ మార్చాలని సూచించడంతో చిర్రెత్తుకొచ్చిన దిల్ రాజు రాజ్ తరుణ్ తీసి పక్కకు పెట్టాడు. శతమానం భవతి సినిమాకు కూడా రాజ్ తరుణ్ తోనే చేయాలనకున్న దానికి తీసుకోలేదు. ఇలా జనవరిలో విడుదలై ఘనవిజయం సాధించిన రెండు చిత్రాలు చేసుంటే రాజ్ తరుణ్ ఎక్కడికో వెళ్లిపోయేవాడు. కానీ తన ప్రవర్తన, దుందుడుకుతనంతో మంచి అవకాశాలను మిస్ చేసుకున్నారు..
ఉయ్యాల జంపాల సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్.. ఆ తర్వాత సుకుమార్ నిర్మించిన ‘కుమారి 21ఎఫ్’ చిత్రంతో ఘనవిజయాన్ని అందుకున్నారు. టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న ఈ హీరోకు రాంగోపాల్ వర్మ కూడా ఓ సినిమా చాన్సిచ్చాడు. దాంతో ఇబ్బడిముబ్బడిగా వచ్చిన అవకాశాలను రాజ్ తరుణ్ కాలదన్నారు. అందులో దిల్ రాజు మూవీ కూడా ఉంది. ఇలా మంచి చిత్రాలను వదులుకొని ప్లాప్ చిత్రాల్లో నటిస్తూ రాజ్ తరుణ్ తన కేరిర్ ను తానే నాశనం చేసుకుంటున్నాడు..

To Top

Send this to a friend