కేటీఆర్.. హరీష్ కు ఇది పెద్ద షాక్

తెలంగాణలో అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేగా సిద్దిపేట ఎమ్మెల్యే, మంత్రి హరీష్ రావు రికార్డు నెలకొల్పారు. ఆయన గడిచిన 2014 ఎన్నికల్లో ప్రత్యర్థిపై లక్ష ఓట్ల మెజార్టీతో గెలిచారు. సీఎం కేసీఆర్ సైతం గజ్వేల్ లో గడిచిన ఎన్నికల్లో కేవలం 19218 ఓట్ల తేడాతోనే ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ప్రతాప్ రెడ్డి పై బొక్కాబోర్లపడి అతికష్టం మీద గెలిచారు.. అంత స్టామినా ఉన్న హరీష్ రావు తెలంగాణ సీఎం ప్రకటించిన సర్వేలో తక్కువ మార్కులు తెచ్చుకోవడం రాజకీయంగా సంచలన రేపుతోంది. ఇప్పటికీ సిద్దిపేటలో హరీష్ ను కొట్టగలిగే మొనగాడు లేడు. అక్కడి ఎవరిని పలకరించినా హరీష్ తప్ప వేరే మాట రాదు. అంతలా ప్రజల్లో కలిసిపోయి అభివృద్ది చేసిన హరీష్ రావు నిజంగా చెప్పాలంటే కేసీఆర్ ను కూడా తోసిరాజని మొదటి స్థానం దక్కించుకోవాలి.. కానీ ఆశ్చర్యకరంగా కేసీఆర్ నిర్వహించిన మొదటి సర్వేలో 60శాతం, రెండో సర్వేలో 82శాతం మాత్రమే మార్కులు దక్కించుకొని వెనుకబడ్డారు. ఈ ఫలితాలు మంత్రి హరీష్ రావుకు మింగుడుపడడం లేదు. మంత్రి ఈటెల మంత్రుల్లో అత్యదిక ప్రజాదరణ పొందిన నేతగా కేసీఆర్ ప్రకటించారు.

సిద్దిపేటలో అప్పట్లో ఒక సర్వే జరిగింది.. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో కేసీఆర్ , హరీష్ రావులు విడిపోయి సిద్దిపేటలో పోటీచేస్తే ఎవరు గెలుస్తారని అక్కడి ప్రజలను కొందరు సర్వే చేశారట.. ఇందులో దాదాపు 60శాతం మంది హరీష్ రావును గెలిపిస్తామని చెప్పగా.. 40శాతం మంది కేసీఆర్ కు సపోర్టు చేశారట.. ఎన్నో ఏళ్లుగా కేసీఆర్ కు కంచుకోటగా ఉన్న సిద్దిపేటను తరువాతి కాలంలో అల్లుడు హరీష్ రావు కు కేసీఆర్ కట్టబెట్టాడు. హరీష్ తన దూకుడుతో కేసీఆర్ కంటే మించి అభివృద్ధిని అక్కడ చేశారు. అందుకే ఇఫ్పుడు అక్కడ కేసీఆర్ , హరీష్ పోటీపడినా హరీషే గెలుస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదని ప్రజలు చెబుతున్నారు. అంత స్టామినా ఉన్న నేతకు సర్వేలో రెండుసార్లు 60 శాతం, 80శాతం మార్కులు రావడంపై అందరిలోనూ విస్మయం వ్యక్తం అవుతోంది..

తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన సర్వే కేసీఆర్ కుటుంబంలో షాక్ కు గురిచేసింది.. ముఖ్యంగా సర్వేలో కేసీఆర్ కొడుకు, సిరిసిల్ల ఎమ్మెల్యే.. ప్రభుత్వంలో నంబర్ 2గా కొనసాగుతున్న కేటీఆర్ కు ప్రజాదరణ తగ్గిపోవడం సంచలనం సృష్టించింది. కేసీఆర్ మొదటి సర్వేలో 70శాతం మార్కులు పొందిన కేటీఆర్.. రెండో సర్వేలో 60శాతం మార్కులు పొందారు. ఓ వైపు ఈటెల లాంటి మంత్రులు అత్యధిక ప్రజాదరణ పొందుతుంటే కేటీఆర్ వెనుకబడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటిచేత్తో టీఆర్ఎస్ ను కేటీఆర్ గెలిపించారు. అంతేకాదు ఐటీశాఖ మంత్రిగా పెట్టుబడుల ప్రవాహం తెస్తున్నారు. అంతేకాదు తనను గెలిపించిన సిరిసిల్ల ప్రజలకోసం టెక్స్ టైల్ ఇండస్ట్రీని తెస్తున్నారు. ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇళ్లు సహా ఎన్నో ప్రజాకర్షక కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ప్రజల్లో ఆదరణ తగ్గడం నివ్వెరపరుస్తోంది. దీనికి ప్రధానంగా కేటీఆర్ సిరిసిల్లలో స్థానిక ఉండకపోవడమే కారణంగా తెలుస్తోంది.. విదేశీ పర్యటనలు, హైదరాబాద్ లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వివిధ సమీక్షలు, సమావేశాలతో నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేస్తున్నందుకే ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని కేసీఆర్ సర్వేలో తేలిందట.. సో ఇప్పటికైనా కొడుకు కేటీఆర్ ను జాగ్రత్తగా ప్రజల చెంత ఉండి పనులు చేయాలని కేసీఆర్ సూచించినట్టు తెలిసింది..

To Top

Send this to a friend