కేటీఆర్ మొదటిసారి భయపడ్డాడట..

0ktr

దేశానికి రాజైనా తల్లికి కొడుకే.. బిడ్డకు తండ్రే.. అందుకే కేటీఆర్ తాను తెలంగాణకు మంత్రిగా ఎంత బిజీగా ఉన్నా తండ్రి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నానని నిరూపించాడు.. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ఆయన కూతరు చదువుతున్న పాఠశాలకు వెళ్లి సాధారణ తండ్రిలా టీచర్ –పేరెంట్ సమావేశానికి హాజరవడం స్కూలులో అందరినీ ఆశ్చర్యానికి లోనుచేసింది. కేటీఆర్ లాంటి బిజీ పర్సన్ ఇలా సామాన్య తండ్రిలా వచ్చి టీచర్ తో మీటింగ్ లో పాల్గొనడం.. తన కుమార్తె మార్కులను ప్రతిభను తెలుసుకోవడంతో పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేవారు.
కేటీఆర్ కుమార్తె హైదరాబాద్ లోని ఓ పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది.. శనివారం కేటీఆర్ కుమార్తె పాఠశాలలో తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం జరిగింది. దీనికి హాజరైన కేటీఆర్.. అక్కడి ఉపాధ్యాయులతో కూతురు చదువు గురించి ఆరాతీశారు. తాను శాసనసభ సమావేశాలకు హాజరైనా.. ఎన్నికల్లో ప్రచారానికి పోయినా ఇంతటి ఉత్కంఠకు, భయానికి గురికాలేదని.. కానీ తండ్రిగా టీచర్-పేరెంట్ సమావేశానికి హాజరైనప్పుడు భయపడ్డానని కేటీఆర్ చెప్పడం కొసమెరుపు..

To Top

Send this to a friend