కేటీఆర్ చొరవ.. చేనేతల బతుకులు బాగు..

చేనేతల బతుకులు తెలంగాణలో మారిపోతున్నాయి. రాజు స్పందించేవాడైతే కష్టాలుండవనే సామెత నిజమవుతోంది.. తెలంగాణలో చేనేతలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మొత్తం చేనేతల కుటుంబాలే వారే ఎక్కువ మంది ఉన్నారు. వారు మరమగ్గాల మీదే పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు.కానీ సరైన గిరాకీ లేక.. పనులు లేక.. ఉన్నా గిట్టుబాటు కాక చాలీచాలనీ బతుకులతో కుంగిపోతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీంతో వారి బతుకులు మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది..

తెలంగాణ సీఎం కుమారుడు కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్ల.. ఆత్మహత్యలను చాలా దగ్గరనుంచి చూసిన కేటీఆర్ ఎలాగైనా వారి బతుకులు మార్చాలని నిర్ణయించారు. ప్రభుత్వంలో తనకున్న పరిపతిని ఉపయోగించుకొని ఇటీవలే కేటీఆర్ .. తెలంగాణలోని అన్ని పాఠశాలలకు యూనిఫాంలు అందించే కాంట్రాక్టును సిరిసిల్ల నేతన్నలకు ఇప్పించారు. సర్వశిక్ష అభియాన్ నిధులు 50 కోట్ల వరకు నేతన్నలకు కాంట్రాక్టుగా ఇచ్చి ఓ మూడు నెలల పాటు వారికి చేతినిండా పనికల్పించారు. ఇప్పుడు మరో మహత్తర ప్లాన్ కు కేటీఆర్ శ్రీకారం చుట్టారు. తెలంగాణలో అతిపెద్ద పండుగ అయిన బతుకమ్మ నాడు ప్రభుత్వం స్వశక్తి మహిళలకు, తెల్లరేషన్ కార్డు దారులకు దుస్తులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే 120కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. ఈ అతిపెద్ద కాంట్రాక్టును మళ్లీ చేనేతలకు ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. ఈ డీల్ ఓకే అయితే ఇక చేనేతలకు సంవత్సరం నిండా ఫుల్లుగా పనిదొరుకుతుంది. వారి ఆకలి తీరుతుంది. ఇటు ప్రభుత్వ ఆశయం నెరవేరుతుంది. ఇలా ఒకే దెబ్బకు సంక్షేమ పథకం.. అటు చేనేతలకు ఉపాధి కల్పిస్తున్న ప్రభుత్వం నిర్ణయం, కేటీఆర్ చొరవ అభినందనీయం..

To Top

Send this to a friend