కేటీఆర్ అందరిలో ఒకడు.. లోకేష్ అందరికీ ఒక్కడు..

ktr-lokesh-apnewsonlinein

కేసీఆర్.. చంద్రబాబుల వారసులు కేటీఆర్, లోకేష్ లలో ఎవరు గొప్ప.. ఎవరు మంచి మాటకారి.. ప్రభుత్వంలో .. పార్టీలో ఎవరిది పైచేయి.. కుమారులను ప్రొజెక్టు చేయడంలో ఎవరు ముందున్నారు..? ఈ ప్రశ్నలన్నీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరూ చర్చించుకుంటున్న విషయాలు.. ఒకరు అందరినీ గౌరవిస్తూ కలుపుగోలుగా వెళ్తూ తనను తాను నిరూపించుకుంటుంటే.. మరొకరు పార్టీలో తనే గొప్పవాడిగా ఫీల్ అయ్యి విమర్శలు ఎదుర్కోంటున్నారు.
ఏపీ ప్రభుత్వంలో.. సాక్షాత్తూ ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి, టీడీపీ మంత్రులకే విలువ లేకుండా పోయింది.. చంద్రబాబు ఎలాగూ రాష్ట్ర పాలకుడిగా శాసిస్తున్నాడు.. బాబు పార్టీ పగ్గాలు వదిలేసి కొడుకుకు అప్పగించేయడంతో ఇక ఆయన ఆడింది ఆట పాడింది పాటగా మారిపోయింది. అప్పట్లో టీడీపీ రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహించింది. ఇందులో ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వేదికపై టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీరు విమర్శలకు తావిచ్చింది. తనకంటే సీనియర్లు అయిన ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రులను లోకేష్ నిలబెట్టి కడిగేయడంపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని నిలదీయడం నిలబెట్టి గౌరవించకుండా ఇష్టానుసారం పనితీరుపై ప్రశ్నించడాన్ని ఖండించారు.. టీడీపీ రాజ్యాంగేతర శక్తిగా లోకేష్ వ్యవహరిస్తున్నాడని మంత్రులు వాపోతున్నారు.. ఈ రాజకీయ శిక్షణ తరగతుల్లో లోకేష్ అతి టీడీపీ మంత్రులను నొప్పించిందట.. అందుకే ఆయనపై గుర్రుగా ఉన్నారట..
ఇక పక్కరాష్ట్రంలో కేసీఆర్ తన కుమారుడితోపాటు మంత్రులందరికీ సమాన హోదా ఇస్తారు. ప్రత్యేకంగా కేటీఆర్ .. ఇతర మంత్రులను డామినేట్ చేయరు.. ఉపముఖ్యమంత్రులు కడియం, మహమూద్ అలీలకు కేటీఆర్ గౌరవించి వాళ్లనే విలేకరుల సమావేశాలప్పుడు మాట్లాడినిస్తారు. కానీ ఇక్కడలోకేష్ మాత్రం ఏకంగా డిప్యూటీ సీఎం, హోంమంత్రులను ప్రశ్నించడం వివాదాలకు కారణమైంది. ఇప్పుడు దీనిపైనే చర్చ సాగుతోంది. కేటీఆర్ లా లోకేష్ అనుకువ పెంచుకోవాలని టీడీపీ శ్రేణులు మథనపడుతున్నాయి.

ఇటీవల అసెంబ్లీలో కూడా కేటీఆర్ కేసీఆర్ పై,టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించిన కాంగ్రెస్ నాయకులకు గట్టి సమాధానం ఇచ్చారు. మంచి పాయింట్లను లెవనెత్తి తన వాక్చాతుర్యంతొ వారికి చురకలంటించారు. కేసీఆర్ లేని సమయంలో సభా నాయకుడి పాత్ర పోషిస్తూ ప్రతిపక్షాలను కడిగిపారేసిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. కేటీఆర్ ప్రసంగం పూర్తయ్యాక… పారిశ్రామిక విధానం సహా పలు పథకాలు బాగున్నాయని జానారెడ్డి అనడం కొసమెరుపు.. ఇలా కేటీఆర్ వాగ్ధాటిలో తండ్రితో సమానంగా పోటీపడుతుండగా.. లోకేష్ అనవసర వివాదాలు,, పోకడలతో అసలు మాటకారి లేని తనంతో అభాసుపాలవుతున్నాడు..

To Top

Send this to a friend