కులాల కుంపంట్లు రాజేస్తున్నారా..?

 

కులాల కుంపట్లు మళ్లీ రాజుకున్నారు. తెలుగు అగ్రహీరోల చిత్రాలు విడుదల కావడంతో కొన్ని సామాజికవర్గాలు తమ తమ హీరోలకు సపోర్ట్ గా లాబీయింగ్ మొదలుపెట్టాయి. కాపు సామాజికవర్గ నేతలు తమ హీరోకు జరిగిన అవమానాన్ని భరించలేక యుద్ధమే మొదలుపెట్టారు. హీరోకు సపోర్ట్ గా పెద్ద సంఖ్యలో ఆడియో ఫంక్షన్ కు తరలివచ్చి సత్తా చాటారు. ఇక సినిమా కూడా హిట్ కావడంతో వారు సంబరాల్లో మునిగితేలారు. అదే సమయంలో మరో సామాజికవవర్గానికి ఇది కంటగింపుగా మారినట్టు సమచారం.. తమ హీరో సినిమా అంతగా ఆడకపోవడంతో ప్రత్యర్థి సినిమాను దెబ్బకొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కాపుసామాజిక వర్గ నేతల విగ్రహాలను, ఆ హీరో ఫ్లెక్సీలను ధ్వంసం చేస్తున్నారు. కృష్ణ జిల్లాలో ఇలాగే తగులబెట్టారు. అలాగే వంగవీటి విగ్రహాన్ని ధ్వంసం చేశారు.. ఈ నేపథ్యంలోనే ఈ రెండు సామాజిక వర్గాలు ఇప్పుడు నువ్వా నేనా అన్నట్టు రెచ్చగొట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా , చానల్స్ లో ఈ కులాల సమీకరణాన్ని బట్టి తమ తమ హీరోల సినిమాలను హైలె ట్ చేస్తూ పక్కవారి సినిమాలను కించపరుస్తున్నారు..

ప్రస్తుతం తెలుగు అగ్రహీరోల సామాజిక వర్గాల వారు రెండుగా విడిపోయి ఫైట్ కు దిగారు. టాలీవుడ్ పరిశ్రమ, మీడియా, ప్రేక్షకులు సైతం విడిపోయి కొట్టుకుంటున్నారు. తెలుగు వెబ్ సైట్లు సైతం తమ హీరోల వార్తలకు, వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఇస్తూ మిగతా వారిని కించపరుస్తున్నాయి. రాంగోపాల్ వర్మ కూడా కులచిచ్చులో భాగస్వామి అయ్యి ఒక హీరోకు సపోర్ట్ గా ప్రత్యర్థులను దుమ్మెత్తి పోస్తున్న సంగతి తెలిసిందే..

ఇక అగ్రహీరోల అభిమానుల సంఘాలు రచ్చ చేస్తున్నాయి. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. వంగవీటి విగ్రహం కూల్చివేతతో పోలీసులు కూడా రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నారు… ఇదంతా కొందరు సోషల్ మీడియా సాక్షిగా వర్గాలు గా విడిపోయి ఎగదోస్తున్నారని పోలీసులు గమనించారు. ఎంటర్ టైన్ మెంట్ ముసుగులో అగ్రహీరోలను పావులుగా పెట్టి కొనసాగుతున్న ఈ కులగజ్జిలో అమాయకులు సమిధలు అవుతున్నారు..

To Top

Send this to a friend