కులమా, ఏకపక్షమా..? ప్రదీప్ చంద్ర రిటైర్ మెంటుకు కారణమేంటి.?

pradeep-chandra-chiefsecretary-telangana

రాజీవ్ శర్మ.. తెలంగాణ తొలి ప్రధాన కార్యదర్శిగా చరిత్రలో నిలిచిపోయారు.. ఆయన సహనం, ఓపికతో తెలంగాణ సీఎం కేసీఆర్ కు నమ్మినబంటుగా ప్రభుత్వ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లారు. ఇక ఆయన రిటైర్ మెంట్ తర్వాత కేసీఆర్ ఘనంగా సన్మానించి తనకు ప్రధాన సలహాదారుగా నియమించారు. ఆ తర్వాత సీఎస్ అయిన ప్రదీప్ చంద్రకు కేవలం నెలరోజుల టైం మాత్రమే ఉంది. పదవీ విరమణను పొడిగించే అవకాశం ఉన్నా కేసీఆర్ ప్రభుత్వం దానిపై చొరవ చూపలేదు.. పట్టించుకోలేదు. దీంతో ఆయన రిటైర్ అయ్యారు. ప్రభుత్వంలో ఆయనకు ఏం పదవి దక్కలేదు.. దీనికి కారణమేంటనే ప్రశ్న చర్చనీయాంశమైంది..
ప్రదీప్ చంద్ర నెలరోజులే పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయనను ప్రభుత్వం, మంత్రులు సన్మానించారు. కేసీఆర్ మాత్రం రాలేదు. ప్రదీప్ చంద్ర దూకుడే ఆయన కొంప ముంచుందని అందుకే కేసీఆర్ ఆయనను వదిలించుకున్నారనే టాక్ నడుస్తోంది.. టీఎస్ ఐపాస్ లాంటి పారిశ్రామిక విధానాన్ని రూపొందించి తెలంగాణ ప్రగతికి బాటలు వేసిన ప్రదీప్ చంద్ర దూకుడే ఆయన్ను తెలంగాణ సీఎస్ గా ఎక్కువ కాలం పనిచేయించలేదని అపవాదు ఉంది. అందుకే ఆయన రిటైర్మెంట్ రోజున తాను వన్ డౌన్ లో వచ్చి రన్ అవుట్ అయ్యానని.. దళిత, సమర్థులైన తన లాంటి అధికారులను ఇలా అర్దాంతరంగా సాగనంపడం కింద స్థాయి అధికారుల్లో తప్పుడు సంకేతాలు పంపుతుందని ప్రదీప్ చంద్ర ఓరకంగా ప్రభుత్వంపై సునిశిత విమర్శలు చేయడం గమనార్హం.

To Top

Send this to a friend