కిట్టుగాడి విజయ యాత్ర…

వరుస విజయాలతో సక్సెస్‌ఫుల్ హీరోగా రాణిస్తున్న యువ క‌థానాయ‌కుడు రాజ్ త‌రుణ్ హీరోగా, అను ఇమ్మాన్యుయ‌ల్ హీరోయిన్‌గా ఏటీవీ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై వంశీకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్ `కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌`. మార్చి 3న విడుద‌లైన ఈ చిత్రం ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తొలి ఆట నుండి హిట్ టాక్ సొంతం చేసుకుని మంచి వ‌సూళ్ళ‌ను రాబ‌ట్టుకుంది. అను ఇమ్మాన్యుయ‌ల్ గ్లామ‌ర్‌, రేచీగా పృథ్వీ హిలేరియ‌స్ పెర్‌ఫార్మెన్స్‌, ర‌ఘుబాబు, వెన్నెల‌కిషోర్‌, సుద‌ర్శ‌న్‌, ప్ర‌వీణ్ కామెడి స‌హా అనూప్ మ్యూజిక్‌కు ఆడియెన్స్ నుండి ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. వంశీకృష్ణ టేకింగ్, ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్ మేకింగ్ వాల్యూస్‌తో రాజ్ త‌రుణ్ కెరీర్‌లోనే పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ చిత్రంగా నిలిచిన కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త సినిమాకు ఇంతటి విజ‌యాన్ని అందించిన ప్రేక్ష‌కుల‌ను ప్ర‌త్య‌క్షంగా క‌లుసుకుని, వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేయ‌డానికి యూనిట్ అంతా సిద్ధ‌మైంది. అందులో భాగంగా మార్చి 10 నుండి విజ‌య యాత్ర‌ను నిర్వ‌హిస్తున్నారు. మార్చి 10న వైజాగ్‌, కాకినాడ, మార్చి 11న రాజమండ్రి, ఏలూరు, మార్చి 12న గుంటూరు, విజ‌యవాడ‌ల్లో చిత్ర యూనిట్ స‌క్సెస్‌టూర్‌లో భాగంగా అక్క‌డి థియేట‌ర్స్‌కు వెళ్ళి ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్స్‌లో ప‌ల‌క‌రించ‌నున్నారు.

To Top

Send this to a friend