కాటమరాయుడు బ్రదర్ పోలీసుల చెంతకు..


కాటమరాయుడు సినిమా డబ్బింగ్ పూర్తికావడంతో సినిమా యూనిట్ అంతా సందడిగా మారింది. ఆ సందడిలోనే కాటమరాయుడు సినిమాలో పవన్ కళ్యాణ్ కు తమ్ముడిగా నటిస్తున్న శివబాలాజీ తన సహచర నటులు ఆలీ , కమల్ కామరాజ్ తో కలిసి సెల్ఫీలు దిగారు. దాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. కొద్దినిమిషాల్లోనే ఓ వ్యక్తి వీరి ఫొటోపై అసభ్యకర పదజాలంతో కామెంట్ చేశాడు.

దీనిపై ఆగ్రహించిన శివబాలాజీ కామెంట్ చేసిన వ్యక్తిపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ గడప తొక్కారు. తనపై అసభ్య పదజాలతో కామెంట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

ఫేస్ బుక్ లో కామెంట్ చేసిన వ్యక్తి ని మొదట శివబాలాజీ అలా ఎందుకు చేశావో చెప్పాలని రిప్లే ఇచ్చాడట.. కానీ ఎంతకూ స్పందించకపోవడంతో తన మనసుకు బాధకలిగిందని.. అందుకే అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు శివబాలాజీ తెలిపారు.

To Top

Send this to a friend