కాటమరాయుడు ఫస్ట్ టాక్

సర్ధార్ గబ్బర్ సింగ్ తో నిరాశపరిచిన పవన్.. ‘కాటమరాయుడు’ సినిమాతో ఆ లోటును భర్తీ చేశాడని అభిమానులు అంటున్నారు. ఈరోజు కాటమరాయుడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అత్తారింటికి దారేది తర్వాత పవన్ కు మరో మెగా హిట్ సొంతమైందని చూసిన పబ్లిక్ చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో లవ్ ట్రాక్ చాలా బాగుందని ఆడియెన్స్ పేర్కొంటున్నారు. పవన్-శృతిహాసన్ ల మధ్య సాగే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయట.. ఇక పవన్ కళ్యాణ్ పాత్రపై దర్శకుడు డాలి ప్రత్యేక దృష్టి నిలిపి ఆయన్ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలానే తెరపైకి తీసుకురావడంలో విజయం సాధించాడని చెబుతున్నారు.

తమిళంలో ఘనవిజయం సాధించిన వీరమ్ కు రిమేక్ గా తీసిన కాటమరాయుడులో కథను మొత్తం ఎలాంటి ట్విస్ట్ లను చేర్చకుండా అలాగే దించేశాడట దర్శకుడు డాలి. కానీ సినిమాలో పవన్ ట్రాక్ ను బాగా ఎలివేట్ చేయడంలో దర్శకుడు డాలీ విజయం సాధించినట్టు ప్రేక్షకులు చెబుతున్నారు. సినిమా మొత్తాన్ని పవన్ వన్ మ్యాన్ షో గా నడిపించాడని అభిమానులు తెలుపుతున్నారు. కాటమరాయుడు టైటిల్ కు తగ్గట్టు పవన్ పాత్ర సూపర్బ్ అని అభిమానులు వివరిస్తున్నారు.

అయితే కాటమరాయుడు సెకండాఫ్ కాస్త నిదానంగా సాగిందని చెబుతున్నారు. కానీ వన్ మ్యాన్ షో వల్ల పవన్ ఎమోషన్, ఫైట్ల తో సినిమా అలరించేలా ఉందని అభిమానులు చెప్పారు. ఫస్ట్ ఆఫ్ కామెడీకి పెద్ద పీట వేస్తే.. క్లైమాక్స్ లో అన్నదమ్ముళ్ల మధ్య వచ్చే ఎమోషనల్ , సెంటిమెంట్ సీన్లను దర్శకుడు చాలా బాగా ఎలివేట్ చేశారని సినిమా చూసిన జనం అంచనావేశారు. ఓవరాల్ గా పవన్ ఖాతాలో మరో భారీ హిట్ చేరిందని టాక్ వినిపిస్తోంది.

To Top

Send this to a friend