కాంగ్రెస్ ఖతం కరో.. మహా బీజేపీ బరో.

అనూహ్యం.. మోడీపై ప్రేమ ఏమాత్రం తగ్గలేదు.. కాంగ్రెస్ ను బండకేసి కొట్టారు. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని విజయాలను సాధించింది. మొత్తం మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పది కార్పొరేషన్లలో 8 మున్సిపాలిటీల్లో కమలం పార్టీ విజయబావుటా ఎగురవేసింది. బీజేపీతో విభేదించి ఒంటరిగా బరిలోకి దిగిన శివసేన రెండు మున్సిపాలిటీలను చేజిక్కించుకుంది. ఇక కాంగ్రెస్, ఎన్సీపీలకు ఒక్కస్థానం కూడా దక్కలేదు. ముంబైలో మాత్రం హంగ్ ఏర్పడింది. ఇక్కడ బీజేపీ, శివసేన పోటీపోటీ పోరాడాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోలో శివసేన 84 స్థానాలను చేజిక్కించుకోగా, బీజేపీ 81 స్థానాలను కైవసం చేసుకుంది.. కాంగ్రెస్ -31, ఎన్సీపీ-9, ఎంఎన్ఎస్-7 స్థానాలు, ఎంఐఎం-3 ఇతరులు 11 స్థానాలను కైవసం చేసుకున్నారు. మేయర్ పదవి దక్కాలంటే 114 సీట్లు అవసరం.. దీంతో శివసేన, బీజేపీ ఇతరుల మద్దతుపై దృష్టిసారించాయి.

కాగా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ కంచుకోట లాంటి లాతూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఇక్కడ గత వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి ఉంటే బీజేపీ ప్రభుత్వం జలదూత్ పేరిట రైళ్లలో నీటిని తరలించి అక్కడి ప్రజలకు అందించింది. దీంతో ఆ కృతజ్ఞతతోనే ఈ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టారు.

కాంగ్రెస్ మరాఠీలకు ఉద్యోగాలు.. వనరులు అనే నినాదంతో మహారాష్ట్రలో బరిలోకి దిగిన శివసేన పార్టీని జనం ఆదరించడం లేదు. ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తును కాలదన్ని ఒంటిరిగా బరిలోకి దిగింది.. కానీ థానే, ముంబైలో మాత్రం ఎక్కువ సీట్లు సాధించి మిగతా చోట్ల బీజేపీ ధాటికి బోల్తాపడింది.

కాగా ఈ ఎన్నికల్లో ప్రధాని నోట్ల రద్దు ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. జనం ఆయన చేసిన పనికి మద్దతు ఇచ్చారన్నది బీజేపీ నాయకుల మాట.. అధికారంలో
బీజేపీ ఉండడంతో అభివృద్ధి జరుగుతుందనే బీజేపీకి ఓటు వేశారని కాంగ్రెస్ చెబుతోంది.. సార్వత్రిక ఎన్నికలే రెఫరెండం అంటోంది.. మొత్తానికి మహారాష్ట్రంలో కాంగ్రెస్ పని ఖతమైంది. బీజేపీకి జనం పట్టం కట్టారు

To Top

Send this to a friend