కాంగ్రెస్ కూ ఓ మీడియా.. రంగంలోకి కోమటిరెడ్డి

ఈరోజుల్లో ఎంత సపోర్టు ఉంటే అంత మైలేజీ.. అది ప్రజల పరంగా.. పత్రికల పరంగా.. న్యూస్ చానాళ్లు, ఎంటర్ టైన్ మెంట్ చానళ్ల పరంగా.. ప్రజల్లోకి పార్టీ కార్యక్రమాలను .. సిద్ధాంతాలను విస్తృతంగా తీసుకెళ్లడమే పార్టీల కర్తవ్యం.. అందుకే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలన్నీ తమకు అనుబంధంగా పత్రికలు, చానల్స్ పెట్టుకొని ప్రజల్లో మనుగడకు కృషి చేస్తున్నాయి. కానీ ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనుకంజలో ఉంది. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్న కాంగ్రెస్ కు ప్రస్తుతం తెలంగాణ మీడియా మద్దతు కరువైంది. పత్రికలు, న్యూస్ చానల్స్ లో కాంగ్రెస్ వాణి వినిపించడం లేదు. అందుకే వారే సొంతంగా ఓ న్యూస్ చానల్ ను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. 2019 ఎన్నికలలోపు బలంగా తయారు చేసి వాడుకోవాలని యోచిస్తున్నారట.. అందులో భాగంగా ఇటీవల కమ్యూనిస్టు పత్రికలో పెట్టుబడులు పెట్టి అందులో కాంగ్రెస్ వార్తలకు ప్రాధాన్యం ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారని సమాచారం..
కాంగ్రెస్ కు అండగా.. తమ వ్యక్తిగత మైలేజీ కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ తెలంగాణలో న్యూస్, ఎంటర్ టైన్ మెంట్, మ్యూజిక్ ఇలా మూడు చానాళ్లను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కాంగ్రెస్ కు అనుబంధంగా ఉండే ఈ చానాళ్లను మరో రెండు, మూడు నెలల్లోనే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ పేరు మీద ప్రారంభించనున్నట్టు తెలిసింది. చానల్ తో కాంగ్రెస్ కు, కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయంగా ఎదిగేందుకు దోహదపడుతుందన్న ఆలోచనతో ఇలా కొత్తగా తెలంగాణలో వీళ్లు సన్నాహాలు చేస్తున్నారు.

To Top

Send this to a friend