కళ్లు పీకీ.. అంగం కోసేసి..


కడప ఫ్యాక్షనిస్టులు భయపడేలా.. బెజవాడ రౌడీలకంటే ఘోరంగా.. కమ్మ ,రెడ్డి కులాల దాడులకంటే దారునంగా ఒళ్ళు గగుర్పొడిచేలా తెలంగాణలో హత్య జరిగింది. ఈ హత్య వెనుక భయపెట్టే వ్యూహాలున్నాయి. నిజాన్ని డబ్బులు వెదజల్లి కప్పేశారు..

ఇంత దుర్మార్గమా.. అధికారంలో ఉంటే హత్యలు.. ఆత్మహత్యలు అవుతాయా.? ఎంతటి ఘోరం ఎంతటి అమానుషం.. తమ దగ్గర పనిచేసే పాలేరు.. పెద్ద ఇంటి అమ్మాయిని లవ్ చేశాడని.. అతడిని చంపేశారు. అలా ఇలా కాదు.. కండ్లు పీకేసి, అతడి అంగం కోసేసి.. కాళ్లు, చేతులు విరగ్గొట్టి చంపేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే పోలీసులకు హుంకూం జారీ చేశాడు. ఆ డూడూ బసవన్నలు ఇది ఆత్మహత్య అని నిర్ధారించారు. ఎవరైనా ఆత్మహత్య చేసుకునే వాడు కళ్లు పీకేసుకుంటారా.? అంగం కోసేసుకుంటారా.. తన కాళ్లు చేతులు ఎలా విరగ్గొంటుకుంటారు.? కానీ ఇక్కడ ఆత్మహత్య అలా జరిగింది. న్యాయాన్ని చిదిమేసి.. ధర్మాన్ని తొక్కేసి ఓ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధి.. మంథని పోలీసులు ఆడిన ఓ ఆటలో ఓ దళిత యువకుడు అమానుషంగా చనిపోయారు..

14 మార్చ్ 2017 తెలంగాణాలోని కరీంనగర్ జిల్లా మంథనిలో ఓ హత్య అత్యంత పాశవికంగా జరిగింది.. కథ పాతదే…. కారణాలు పాతవే…. కక్షలు పాతవే…. TRS నేతల ప్రోద్భలంతోనే ఈ హత్య వెలుగులోకి రాలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. బంగారు తెలంగాణా నిర్మాతలే ఈ హత్యను పోలీసులతో సాయంతో తొక్కేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మంథనికి చెందిన మాదిగ యువకుడు మధుకర్…దొర కింద జీతగాడిగా పనిచేస్తున్నాడు… అక్కడికి దగ్గర్లోనే ఉండే మున్నూరు కాపు యువతీ పాలేరును ప్రేమించింది… పెళ్లి చేసుకుంటానని కుటుంబంతో కొట్లాడింది… వీరి మధ్య ప్రేమకు సహకరించిన మిత్రుడు, కుటుంబ సభ్యుడే మధుకర్ హత్యకూ సహకరించాడు.. డబ్బులకు అమ్ముడుపోయి కడతేర్చారు.. యువకుణ్ణి నమ్మించి తీసుకెళ్లి హంతకులకు అప్పజెప్పారు.. అమ్మాయి ముందే కొట్టారు… వద్దు నాన్నా.. వాడు నాకు బాగా నచ్చినవాడు.. అన్నా వినకుండా కొట్టారు.. అమ్మాయి పురుగుల మందు తాగిందట.. 13 న మాయం అయినా అతడి ఆచూకీ తెలియకపోవడంతో యువకుడి కుటుంబము అల్లాడింది..

ఈనెల 14న అబ్బాయింట్లో ఫోన్ మోగింది.. అమ్మాయి ఏడుస్తూ అడిగింది..మధు వచ్చాడా? మీ ఇంటి దగ్గర కాలువ దగ్గర్లో వెతకండి.. ప్లీజ్ అంకుల్ వెతకండి అంటూ బతిమిలాడింది.. మధుకర్ ఆచూకీ దొరకపోవడంతో కుటుంబం పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు అమ్మాయికి ఫోన్ చేశారు. బంధువులు నేరుగా హంతకుల దగ్గరికే వెళ్లి నిలదీశారు.. మా వాడి శవమెక్కడా?? చివరకు శవం ఎక్కడ వేశారో అడ్రస్ చెప్పిన ఆ గ్రామ సర్పంచ్. దీంతో దళిత కుటుంబం నిర్ఘాంతపోయింది. ప్రేమించాడనే కారణంతో చంపించిన అగ్రకుల అహంకారం చూసి గుండెలవిసేలా ఏడ్చారు.

పోలీసుల వత్తాసు హాంతకులకే ..
యువకుడి శవం అత్యంత దారుణ స్థితిలో చూసి కుటుంబం రోదనలు మిన్నంటాయి. కళ్లు పీకేశారు. పురుషాంగం కోసేశారు. రాడ్లతో చేతులు కాళ్లు విరగ్గొట్టారు. పైగా మార్చురీకి తరలించిన శవానికి గాయాలేవి లేవని స్థానిక CI ప్రకటన.. అయినా CI ఆత్మ హత్యే నంటాడు.. ప్రశ్నించిన ప్రజలను తంతానంటాడు..

ఇక్కడ ప్రేమించిన అమ్మాయి అధికార పార్టీ ఎమ్మెల్యే గారి బంధువని సమాచారం. అందుకే .. ఎంత అర్తనాదాలు వినిపించినా అక్కడ మీడియాను, ప్రజాప్రతినిదులను, పోలీసులను కొనేసి ఈ ఉదంతాన్ని 15రోజులుగా తొక్కేవారు. చివరకు కొందరు ధైర్యం చేసి వెలుగులోకి తీసుకురావడంతో దళిత సంఘాలు భగ్గుమన్నాయి. ఆందోళన చేసిన దళిత సంఘాలను , ప్రజలను బెదిరించి శవాన్ని తరలించి అంత్యక్రియలు ముగించారు.

 

To Top

Send this to a friend