కల్లు ఎంతమంచిదో …జాతీయ పోషకాహార సంస్థ

కల్లులో సమృద్ధిగా ఖనిజ లవణాలు, విటమిన్లు ఊబకాయం, మధుమేహం నియంత్రణకు మంచిది.. రోగనిరోధకశక్తి అధికం

మా తాత , మా నాన్న ఎక్కువగా కల్లు తాగేవారు అని మనలో కొందరు చెబుతుంటారు.. అదీ నిజమేనని పరిశోధనల్లో తేలింది.. తాటిచెట్టు కల్పవృక్షమే… నాన్నలు, తాతలు చెప్పినట్టు కల్లు తాగితే చాలా మంచిదే.. తాటికల్లు సుమధురమైన దివ్యౌషధమే. తాటి వృక్షం ప్రసాదించే కల్లు మాత్రం ఆరోగ్యానికి మేలు చేస్తుందనేది తాజా పరిశోధనల్లో వెల్లడైన సత్యం. మోతాదులో సేవిస్తే ఈ పానీయం ఆయురారోగ్యాలకు రక్షగా నిలుస్తుంది. శరీరానికి జవసత్వాలను అందజేస్తుంది. బహుశా ఈ సత్యాన్ని గుర్తించి కాబోలు.. తెలంగాణలో పూర్వకాలంనుంచే పిల్లలు, మహిళలు, వృద్ధులు సైతం ప్రత్యేక సందర్భాల్లో దీన్ని సేవిస్తూ వచ్చారు.

సురాపానంగా వ్యవహరించే తాటికల్లులో అనేక ఔషధ గుణాలున్నాయి. దేహానికి అవసరమైన పోషకాలు కూడా అత్యధికంగా ఉన్నాయి. తగిన మోతాదులో సేవిస్తే ఇది ఆరోగ్యానికి మేలు చేయడమే గాకుండా రోగాలు రాకుం డా కాపాడుతుంది. తెలంగాణ పల్లెల్లో విరివిగా లభించే తాటికల్లుపై జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) పరిశోధన చేసి ఇందులో ఉన్న పోషక విలువలను గుర్తించింది. ఇటీవల ఈ సంస్థ జాతీయ స్థాయిలో విడుదల చేసిన కాంపోజిషన్ పుస్తకంలో ఈ విషయాలను వెల్లడించింది. తాటికల్లులో ఐరన్, కాల్షియం వంటి పదార్ధాలు సమృద్ధిగా ఉన్నాయని, ఇవి ఎముకల పటిష్టానికి, రక్త వృద్ధికి దోహదం చేస్తాయని తెలిపింది.

ఇక మినరల్స్, విటమిన్స్ ఆరోగ్య సమతుల్యతకు దోహ దం చేస్తాయని పేర్కొంది. ముఖ్యంగా ఇందులో లభించే ఫ్యాంటీ యాసిడ్స్ శరీరంలో కొవ్వు పెరుగకుండా నివారిస్తాయి. తాటికల్లులో ఫైబర్ కూడా పుష్కలంగా లభిస్తుందని, ఇది షుగర్ వ్యాధిగ్రస్థులకు మేలుచేస్తుందని తెలిపింది. ఇక ఇందులోని విటమిన్ సీ రోగనిరోధకశక్తిని పెంచుతుంది. తాటికల్లుకు సంబంధించిన డాటాను వివరంగా ఈ పుస్తకంలో పొందుపరిచారు. తాటి కల్లులో వాటర్ సాల్యూబుల్ విటమిన్స్‌లో థయామిన్, రిబోఫ్లేవిన్, నియాసిన్, ప్యాంటాసిడ్, విటమిన్ సీ వంటి విటమిన్లు ఉండగా, ఫ్యాట్ సాల్యూబుల్ విటమిన్స్ కూడా ఉన్నాయి. కెరోటెనాయిడ్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి. అదేవిధంగా శరీరంలో కొవ్వును నియంత్రించే సాచ్యురేచ్‌డ్ ఫ్యాటీ ఆసిడ్స్(టీఎస్‌ఎఫ్‌ఏ), మోనో ఆన్‌సాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్(టీఎంయుఎఫ్‌ఏ), పాలీ అన్‌సాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్(టీపీయుఎఫ్‌ఏ)ఉన్నాయి.

మార్కెట్ పానీయాలకన్నా నయం..
ఇందులోని ఔషధ గుణాలు గుర్తించినందువల్లనే తెలంగాణలో పూర్వకాలంనుంచి చిన్న పిల్లలకు కూడా దీన్ని వాడుతూ వచ్చారు. కల్లు మత్తుపదార్థం అనే దుష్ప్రచారాలు జరిగాయి. దీనికితోడు పట్టణాల్లో కల్తీలు ప్రజలకు ఈ ఔషధాన్ని క్రమంగా దూరం చేశాయి. అయితే వాస్తవంలో మార్కెట్లో లభించే అనేక పానీయాలకన్నా కల్లు ఎంతో మేలైంది. తాటిచెట్టు వద్ద సకాలంలో దింపిన కల్లు మంచి ఔషధంగా పనిచేస్తుంది. అయితే అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్టు ఏదీ అతిగా తీసుకున్నా క్షేమకరం కాదు. ఇది ఔషధానికైనా, తాటికల్లుకైనా వర్తిస్తుంది. అదేపనిగా మోతాదుకు మించి సేవిస్తే ఏదైనా అనారోగ్యానికే దారితీస్తుంది.

పరిశోధనల్లో తేలిన ప్రకారం ఆరోగ్యానికి మేలు చేసే షుగర్స్
తాటికల్లు: 5.73
కొబ్బరి నీళ్లు : 3.06

To Top

Send this to a friend