కరెన్సీ కారు ప్రేమ.. చిక్కులు..

ఫిబ్రవరి 14.. ప్రేమికుల దినోత్సవం.. ప్రేమికులకు పండుగే.. అలాంటి పండుగ నాడు ఓ బడా డబ్బున్న ప్రేమికుడు కొత్తగా ఆలోచించాడు. తన ప్రియురాలికి ఏదైనా కొత్తగా బహుమతి ఇవ్వాలనుకున్నాడు. అంతా సిద్ధం చేసి ప్రియురాలి వద్దకు వెళుతుండగా.. పోలీసులు చూసి అతడిని కటకటాల పాలు చేశారు. ఇంతకీ అతడు చేసింది చూస్తే మీరు నోరెల్ల బెట్టాల్సిందే..
ఆ ప్రేమికుడు ప్రేమికుల దినోత్సవాన తన ప్రియురాలికి సర్ ప్రైజ్ ఇవ్వడానికిరూ.2000 నోట్లతో తన కారును ముస్తాబు చేయించాడు. మొత్తం రెండు వేల నోట్లను కారుకు అతికించేసి.. రోడ్డు మీదకు వచ్చాడు. ఆ కారును చూసిన ప్రజలతోపాటు ముంబై పోలీసులు కూడా ఖంగుతున్నారు. కారుతో పాటు అతడ్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ వ్యక్తి బడా బాబు.. డబ్బున్న సెలబ్రెటీ కావడంతో పేరు బయటపెట్టడానికి ముంబై పోలీసులు అనుమంతిచలేదు. కారుపై లవ్ సింబల్ చుట్టూ రెండు వేల నోట్లతో ప్రియురాలికి సర్ ప్రైజ్ ఇవ్వాలనుకున్న ప్రేమికుడికి ఇలా పోలీసులే సర్ ప్రైజ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది..

To Top

Send this to a friend