కమ్యూనిస్టు.. కాంగ్రెస్ ప్లాప్ స్టోరీలే..


అసెంబ్లీ వేదికగా కేసీఆర్ ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు సిద్దాంతాలు నేటి కాలంలో పనికిరాదని.. కమ్యూనిస్టు సిద్ధాంతాలను పక్కనపెట్టి చైనానే అమెరికా వంటి పెట్టుబడిదారి దేశంతో పోటీపడుతుందని కేసీఆర్ అన్నారు. ఇటీవల యాదవులకు గొర్రెల పంపిణీపై తెలంగాణ వ్యాప్తంగా ప్రతిపక్షాలు.. పలువు రు సోషల్ మీడియా ద్వారా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.. దీనికి కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు.

యాదవులకు 75శాతం సబ్సిడీతో గొర్రెలు అందజేస్తామన్న తమ ప్రకటనపై అందరూ మండిపడుతున్నారని.. కానీ గొర్రెలు, కోళ్లు పెంచేవాళ్లు మనుషులు కాదా అని కేసీఆర్ ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్ తోనే యాదవులకు సబ్సిడీపై గొర్రెలు ఇస్తున్నామన్న విమర్శలను కేసీఆర్ తిప్పికొట్టారు. గొర్రెల పంపిణీలో ఒక్క రూపాయి కూడా కేంద్రం నిధులు లేవని స్పష్టం చేశారు..

అంతేకాదు.. కాంగ్రెస్ నాయకులు ముందస్తు ఎన్నికల మాయలో ఉన్నారని.. కానీ ప్రజలు మాకు పాలించమని 5 ఏళ్లు సమయం ఇచ్చారని.. పూర్తిస్థాయిలో పాలించి తర్వాత ఎవరు బెటరో ప్రజలే నిర్ణయిస్తారని కేసీఆర్ చెప్పారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనే తమకు లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.

To Top

Send this to a friend