కమల వికాసం.. హస్త విలాపం

5 రాష్ట్రాల ఎన్నికల్లో కమల వికాసం కనిపించింది. యూపీ, ఉత్తరఖండ్ లో బీజేపీ గెలుపొందింది. ఇక పంజాబ్ లో బీజేపీ-అకాలీదళ్ ఓడిపోయింది. అధికారపార్టీని మట్టికరిపించి ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధించింది. నవ జ్యోత్ సింగ్ సిద్దూ పంజాబ్ లో కాంగ్రెస్ గెలుపుకు దోహదపడ్డారు. ఇక గోవా, మణిపూర్ లలో కాంగ్రెస్, బీజేపీ సమాన సంఖ్యలో సీట్లు సాధిస్తూ అక్కడ హోరాహోరీగా తలపడుతున్నాయి. గోవా, మణిపూర్ లలో హంగ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు నిజం చేస్తూ ఆయా రాష్ట్రాల్లో ప్రజలు పార్టీలకు పట్టం కట్టారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా.. రెండున్నర గంటల్లోనే యూపీ, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో విజేతలెవరన్న దానిపై స్పష్టత వచ్చేసింది. మణిపూర్‌, గోవా రాష్ట్రాల్లో మాత్రం కాంగ్రెస్‌, భాజపా మధ్య హోరాహోరీ కొనసాగుతోంది._

ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపా 300కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ నాలుగింట మూడొంతుల మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. పంజాబ్‌లో కాంగ్రెస్‌ మేజిక్‌ ఫిగర్‌ను దాటి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఉత్తరాఖండ్‌లో భాజపా ఆధిక్యంలో కొనసాగుతుండగా.. మణిపూర్‌లో భాజపా, కాంగ్రెస్‌ నువ్వా నేనా అన్న రీతిలో పోటీపడుతున్నాయి. గోవాలోనూ కాంగ్రెస్‌, భాజపా మధ్య హోరాహోరీ కొనసాగుతోంది.

ఐదు రాష్ట్రాల్లో ఆయా పార్టీల ఆధిక్యం ఇలా..

*ఉత్తర్‌ప్రదేశ్‌ (403/403)*
* భాజపా-308
* ఎస్పీ-కాంగ్రెస్‌ కూటమి- 67
* బీఎస్పీ – 20
* ఇతరులు- 8

*పంజాబ్‌(117/117)*
* కాంగ్రెస్‌- 69
* ఎస్‌ఏడీ- 24
* ఆప్‌ – 21
* ఇతరులు-3

*ఉత్తరాఖండ్‌(70/70)*
* భాజపా- 51
* కాంగ్రెస్‌- 15
* ఇతరులు-4

*మణిపూర్‌(30/60)*
* భాజపా-14
* కాంగ్రెస్‌-14
* ఎల్డీఎఫ్‌-3
* ఇతరులు 4

*గోవా(17/40)*
* భాజపా కూటమి-10
* కాంగ్రెస్‌ కూటమి- 9
* ఎంజీపీ కూటమి-1
* ఇతరులు-2

To Top

Send this to a friend