కబాలీ సరసన ఖైదీ నంబర్ 150.. అదే క్రేజ్.. అదే రిపీట్..

khaidi-no-150-dubai-release

రజినీ, చిరు దాదాపు ఒకే సారి ఇండస్ట్రీలో ప్రవేశించారు. ఒకరు తమిళ తంబీల గుండెల్లో గుడికట్టగా.. మరొకరు తెలుగు ప్రజల అభిమానం చూరగొన్నారు.. భాషా తర్వాత రజినీ తీసిన ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ కబాలీ.. ఈ చిత్రం విడుదలకు ముందు విపరీతమైన ప్రచారం జరిగింది. కొన్ని ఎయిర్ లైన్స్ సంస్థలు ఉచిత తాయిలాలు ప్రకటించాయి. విమానాలకు కబాలి సినిమా పోస్టర్ లు అంటించాయి.. రజినీ నటించిన కబాలి మూవీ విడుదల జూలై 22న అయితే చైన్నై, బెంగళూరులోని పలు కంపెనీలు , సౌదీ అరేబియా, గల్ఫ్ , మలేషియా, బ్యాంకాక్, సింగపూర్ లలో ఉద్యోగులకు సెలవులు ఇచ్చారంటే రజినీ మాయను అర్థం చేసుకోవచ్చు.. కబాలీ హిట్ ప్లాప్ అన్నది పక్కనపెడితే అగ్రహీరో రజినీ కాంత్ అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఆయా కంపెనీలు సెలవుల్ని మంజూరు చేశాయి..

ఇప్పుడూ అదే రిపీట్ అయ్యింది. చిరంజీవి దాదాపు పదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ఖైదీ నంబర్ 150 వ సినిమాపై అదే హైప్ వచ్చింది.. అందరూ ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.. కబాలీ లాగే ఖైదీనంబర్ 150 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.. ఇదో పండగ వాతావరణాన్ని సృష్టిస్తుండడంతో అందరి దృష్టి నెలకొంది.. తాజాగా సౌదీలోని రియాద్ లోని ఓ కన్ స్ట్రక్షన్ కంపెనీ తమ తెలుగు ఉద్యోగులకు సెలవు ప్రకటించిందట.. నోటీస్ లో ఖైదీ నంబర్ 150 సినిమా కోసం తెలుగు ఉద్యోగులందరికీ ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్టు పేర్కొంది.. దీంతో కబాలితో రజినీ లాగేనే చిరు తన స్టామినాను మరోసారి నిరూపించుకున్నట్టు అయ్యింది..

To Top

Send this to a friend