కన్నడ పరిశ్రమ దిగొచ్చింది..జక్కన్న గ్రేట్.

తెలుగు, తమిళ, మళయాల హిట్ సినిమాలు అన్ని భాషల్లో విడుదలై హిట్ కొడుతుంటాయి. ఒక్క కన్నడ భాషలో తప్ప.. మన బాహుబలి తమిళ, మళయాలంలో రికార్డు వసూళ్లు సాధించింది. అలాగే రజినీ కబాలి తెలుగు, మళయాళం విజయం సాధించింది. కానీ కన్నడ పరిశ్రమలో మాత్రం పర భాష అనువాద సినిమాలు విడుదల కావు.. కాకూడదు కూడా. ఎందుకంటే కన్నడ సినీ పరిశ్రమ డబ్బింగ్ సినిమాలను నిషేధించింది. అక్కడ స్ర్టెయిట్ సినిమాలే విడుదల కావాలని షరతు పెట్టింది. అందుకే దేశం మొత్తాన్ని అలరించిన బాహుబలి లాంటి కళాఖండాన్ని కన్నడ వాసులు చూడలేకపోయారు. దీనిపై ఆ రాష్ట్రంలోని యువత, ముఖ్యంగా .. బాహుబలి లాంటి సూపర్ హిట్ సినిమాలను తాము మిస్సవుతున్నామని ఇంటా బయట , సోషల్ మీడియాలో తీవ్ర నిరసన తెలిపారు. దీంతో కన్నడ పరిశ్రమ దిగొచ్చింది.. బాహుబలి2 సినిమా కోసం ఏకంగా నిబంధనలను సడలించింది. డబ్బింగ్ సినిమాలకు ఓకే చెప్పింది..

బాహుబలి2 లాంటి కళాఖండాన్ని ఈసారి వచ్చే ఏప్రిల్ లో విడుదల చేయబోతున్నారు. రాజమౌళి దీన్ని ఇప్పటివరకు దేశంలో తెలుగు, తమిళ,మ ళయాల, హిందీ భాషల్లో మాత్రమే విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మరో భాషలోకి కూడా విడుదల చేస్తున్నారట.. కన్నడ సినీ ఇండస్ట్రీ చైర్మన్ బాహుబలి దర్శకుడు రాజమౌళికి బాహుబలి2ను కన్నడలోనూ విడుదల చేయాలని స్వయంగా విజ్ఞప్తి చేశారట.. బాహుబలి లాంటి అద్భుత చిత్రాన్ని తమ భాషలో చూసే భాగ్యం తమకు కల్పించాలని రాజమౌళిని కోరాడట.. దీంతో రాజమౌళి కన్నడలో కూడా విడుదల చేసేందుకు డబ్బింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టినట్టు సమాచారం.

ఇలా బాహుబలి కన్నడిగుల మనసులనే కదిలించింది. ఓ గొప్పచిత్రం కోసం నిబంధనలు తొక్కా తోలు అన్ని పక్కనపెట్టి కన్నడ పరిశ్రమ పరభాష డబ్బింగ్ సినిమాలను అనుమతిస్తోంది. ఇంతకంటే గొప్పవిజయం బాహుబలి సినిమాకు మరోటి లేదంటే అతిశయోక్తి కాదేమో.. ఏంతైనా జక్కన్న గ్రేట్..

To Top

Send this to a friend